
న్యూఢిల్లీ: ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని మోదీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. దీనిద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవవచ్చని తెలిపారు. యోగాను ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
‘‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి చోటు నుంచి చాలా మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి . యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
Addressing the #YogaDay programme. https://t.co/tHrldDlX5c
— Narendra Modi (@narendramodi) June 21, 2021
చదవండి: ఈ భూమిపై మాకింత చోటేది?