ఈరోజు ట్విట్టర్ చూశారా..!
చీమచిటుక్కుమన్నా టపీమని చెప్పే అత్యంత వేగవంతమైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్. ఆ ట్విట్టర్ నేడు ప్రపంచంతో కలిసి యోగాసనం వేసింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం కావడంతో ప్రముఖ సామాజిక అనుసంధాన వేధిక ట్విట్టర్ యోగా రంగును పులుముకుంది. వందల సంఖ్యలో యోగా ట్వీట్లతో నిండిపోయింది. మరే, సామాజిక అనుసంధాన వేదికలో కనిపించనన్ని యోగాకు సంబంధించిన వార్తలను కళ్లముందుకు తీసుకొచ్చింది. ఒక్క భారత దేశంలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలనే కాదు.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలను తనతో మోసుకొచ్చి తన అభిమానులకు వండివారుస్తోంది.
ఇప్పటికే వందల సంఖ్యలో యోగా ఫొటోలు.. వీడియోలు, కథనాలు ట్విట్టర్లో దర్శనం ఇస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ట్విట్టర్ కాస్తంతా ఎక్కువ మొత్తంగానే యోగా అంశాలను అందించగలుగుతుందని చెప్పాలి. భారత దేశ ప్రధాని నరంద్రమోదీ నుంచి వివిధ ప్రపంచ దేశాల నేతల, సెలబ్రిటీల, సామాన్యుల, విద్యార్థులు ఒక్కరని కాదు దాదాపు అన్ని రకాల వ్యక్తుల యోగాసనాలను అభిప్రాయాలను ట్విట్టర్ మోసుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ట్విట్టర్లోకి అడుగుపెట్టిన వాళ్లకు మాత్రం 'వావ్.. యోగా లోకం ఇంత పెద్దదా' అని అనిపించకమాత్రం మానదు.