June 21
-
2020 యుగాంతం: అంతా ఉత్తుత్తిదే
న్యూఢిల్లీ: డూమ్స్‌డే ప్రవచనాలు, మయాన్ క్యాలెండర్ ప్రకారం జూన్ 21, 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది సిద్దాంతకర్తలు పేర్కొడనంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అదేరోజు అమావాస్య, సూర్యగ్రహణం కూడా రావడంతో ఇది నిజమే అయ్యింటుందని భావించి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. నిన్న(ఆదివారం) 2020 జూన్ 21 ముగియడంతో అదంతా ఉత్తుత్తిదే అని తెలీంది. అయితే ఈ ఏడాది 2020లో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు సోకి.. లక్షల్లో మరణించడంతో మయాన్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ప్రపంచం అంతమైపోతుందని సిద్దాంతకర్తలు అంచనా వేశారు. ఇంతకుముందు కూడా మయాన్ క్యాలెండర్ ప్రకారం 2012లో ప్రపంచం ముగియనుందంటూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జూన్ 21 ముగియడంతో 2012 మాదిరిగానే మాయాన్ క్యాలెండర్ అంతా అబద్ధమేనని మరోసారి రుజువైంది. (2012 కాదు, 2020లో యుగాంతం!) ఈ మాయాన్ క్యాలెండర్ అనేది 1582 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది. అయితే దీనికి ముందు తేదీలను కనుగొనడానికి వివిధ క్యాలెండర్లను ఉపయోగించాల్సి వచ్చిందని సిద్దాంతకర్తలు తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రజలు ఎక్కువగా మయాన్, జూలియన్ క్యాలెండర్లను అనుసంరించేవారని సమాచారం. ప్రస్తుతం ప్రపంచ దేశ ప్రజలు ఎక్కువగా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తున్నారు. ఈ వింతైన సిద్ధాంతం ప్రకారం జూలియన్ క్యాలెండర్ మరో క్యాలెండర్‌కు మార్చబడుతున్న సమయంలో ఈ క్యాలెండర్ నుంచి సంవత్సరంలోని 11 రోజులు పోయాయాని నిపుణులు పేర్కొన్నారు. ఈ తర్వాత రోజులు ఆ రోజులు జతచేయబడ్డాయి. కానీ దీని ప్రకారం ప్రస్తుతం మనం 2020లో కాకుండా 2012లో ఉన్నామని నిపుణులు చెబుతున్నారు. (తూచ్.. యుగాంతం ఉత్తదే!) దీని గురించి పాలో తగలోగుయిన్ అనే శాస్త్రవేత్త ఈ సిద్దాంతాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ... ‘జూలియన్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం మనం సాంకేతికంగా 2012లో ఉన్నాము. గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి మారడం వల్ల సంవత్సరంలో కోల్పోయిన 11 రోజులను కొల్పోయాం. గ్రెగోరియన్ క్యాలెండర్ బట్టి (1752-2020) సార్లు 11 రోజులు = 2,948 రోజులు ఉపయోగించి 268 సంవత్సరాలు. 2,948 రోజులు / 365 రోజులు (సంవత్సరానికి) = 8 సంవత్సరాలు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం మనం జూన్ 21, 2020 అనేది కి డిసెంబర్ 21, 2012 అవుతుంది. దీంతో కొంతమంది సిద్ధాంతకర్తలు 2012 డిసెంబర్ 21ని ప్రపంచ అంతంగా ప్రతిపాదించారు. . -
రేపు అతిపెద్ద పగటి రోజు
► 13 గంటల 7 నిమిషాల పాటు పగలు ► గుడివాడలో తొలి సూర్యోదయం నిజమే.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవించనున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది. చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది. ఏటా జూన్ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం. మన రాష్ట్రంలో గుడివాడ ఈ నెల 21వ తేదీ మనదేశంలోని మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది. మన రాష్ట్రంలో తొలి సూర్యోదయం కృష్ణాజిల్లాలోని గుడివాడలో సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. ఇలాంటి పరిణామం 1975లో వచ్చిందని, తిరిగి మళ్లీ 2203వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. – పటమట (విజయవాడ తూర్పు) -
అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లు
ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ మరోసారి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లకు తెర తీసింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటినుంచి జూన్ 21 వరకు సాగే మూడు రోజుల ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మోటోరోలా, వన్‌ప్లస్, ఆపిల్, శాంసంగ్ తదితర బ్రాండ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్ లాంటి ఇతర ఉపకరణాలపై ఆఫర్లు , డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3 టీ , జీ5 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, కూల్‌పాడ్ నోట్ 5 లైట్ తదితర స్మార్ట్ఫోన్లపై ఈ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 7 32జీబీ, 128జీబీ, 256జీబీ ఫోన్లు రాయితీ ధరల్లో వరుసగా రూ. 42,999, రూ. 54,490,రూ. 65,900 లో లభ్యం. అలాగే రూ. 13,060 పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఐఫోన్ 6 32జీబీ రూ. 24,999కే లభించనుది. దీనికి కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వన్ ప్లస్ 3టీపై డిస్కౌంట్ తోపాటు వొడాఫోన్ 45 జీబీ డేటా అయిదు నెలలు ఉచితం. మోటో జెడ్ ను రూ.29వేలకే అందిస్తోంది. రూ. 13వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ , శాంసంగ్ గెలాక్సీ 7 ప్రో రూ.8690కు అందుబాటులో ఉంచింది. రూ. 6,712 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూల్ ప్యాడ్ పై రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తోంది. వీటితోపాటు ఆపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్ తదితర బ్రాండ్లు ల్యాప్ ట్యాప్ ధరలను కూడా భారీగా తగ్గించింది. దాదాపు రూ.10 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేనా..ఈ మూడు రోజుల అమ్మకాల్లో టీవీ, ఫ్రిజ్ ఇతర పెద్ద గృహోపకరణాలపై డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. -
ఈరోజు ట్విట్టర్ చూశారా..!
చీమచిటుక్కుమన్నా టపీమని చెప్పే అత్యంత వేగవంతమైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్. ఆ ట్విట్టర్ నేడు ప్రపంచంతో కలిసి యోగాసనం వేసింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం కావడంతో ప్రముఖ సామాజిక అనుసంధాన వేధిక ట్విట్టర్ యోగా రంగును పులుముకుంది. వందల సంఖ్యలో యోగా ట్వీట్లతో నిండిపోయింది. మరే, సామాజిక అనుసంధాన వేదికలో కనిపించనన్ని యోగాకు సంబంధించిన వార్తలను కళ్లముందుకు తీసుకొచ్చింది. ఒక్క భారత దేశంలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలనే కాదు.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలను తనతో మోసుకొచ్చి తన అభిమానులకు వండివారుస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో యోగా ఫొటోలు.. వీడియోలు, కథనాలు ట్విట్టర్లో దర్శనం ఇస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ట్విట్టర్ కాస్తంతా ఎక్కువ మొత్తంగానే యోగా అంశాలను అందించగలుగుతుందని చెప్పాలి. భారత దేశ ప్రధాని నరంద్రమోదీ నుంచి వివిధ ప్రపంచ దేశాల నేతల, సెలబ్రిటీల, సామాన్యుల, విద్యార్థులు ఒక్కరని కాదు దాదాపు అన్ని రకాల వ్యక్తుల యోగాసనాలను అభిప్రాయాలను ట్విట్టర్ మోసుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ట్విట్టర్లోకి అడుగుపెట్టిన వాళ్లకు మాత్రం 'వావ్.. యోగా లోకం ఇంత పెద్దదా' అని అనిపించకమాత్రం మానదు. -
21న సంజీవయ్య పార్కులో 'యోగా డే'
కాచిగూడ (హైదరాబాద్) : స్థానిక సంజీవయ్య పార్కులో ఈ నెల 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి తెలిపారు. బర్కత్‌పురలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, వాకర్స్, వివిధ యోగా కేంద్రాల నుంచి యోగా దివస్‌లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రకాష్ నడ్డ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న యోగా దినం పాటించనున్న విషయం విదితమే.