
హైదరాబాద్: యోగాభ్యాసం వల్ల శారీరక దృఢత్వంతో పాటుగా మానసికబలం పెరుగుతుందని, ప్రతీ పాఠశాల, కళాశాలల్లోను యోగాను ప్రవేశపెట్టాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంస్కృతి రాజ్‌భవన్ కమ్యూనిటీ సెంటర్‌లో అధికారులు, సిబ్బందితో కలసి గవర్నర్ నరసింహన్ దంపతులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. గవర్నర్ యోగా గురువైన రవికిశోర్‌కు, ఆయన యోగా బృందానికి ఈ సందర్భంగా నరసింహన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, మాజీ డీజీపీ ఏకే మహంతి పలువురు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.