narasimhan couple
-
HYD: తమిళిసైను కలిసిన మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు కలిశారు. రాజ్‌భవన్‌లో వీరు కలుసుకోవడం విశేషం. వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిశారు. కాగా, మర్యాదపూర్వకంగానే తమిళిసైను కలిసి నరసింహన్ దంపతులు ముచ్చటించినట్టు సమాచారం. రాజకీయంగా వీరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. -
ప్రతి బడి, కళాశాలల్లో యోగాను పెట్టాలి: గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: యోగాభ్యాసం వల్ల శారీరక దృఢత్వంతో పాటుగా మానసికబలం పెరుగుతుందని, ప్రతీ పాఠశాల, కళాశాలల్లోను యోగాను ప్రవేశపెట్టాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంస్కృతి రాజ్‌భవన్ కమ్యూనిటీ సెంటర్లో అధికారులు, సిబ్బందితో కలసి గవర్నర్ నరసింహన్ దంపతులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. గవర్నర్ యోగా గురువైన రవికిశోర్‌కు, ఆయన యోగా బృందానికి ఈ సందర్భంగా నరసింహన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, మాజీ డీజీపీ ఏకే మహంతి పలువురు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కల్యాణం.. వైభోగం
సాక్షి, యాదాద్రి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్ రక్షకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవం శుక్రవారం యాదాద్రిలో అంగరంగ వైభవంగా జరిగింది. యజ్ఞాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు, అర్చక బృందం కల్యాణతంతు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన గల బాలాలయంలో ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు. విశ్వక్సేన, ఆరాధన పూజలు నిర్వహించిన అనంతరం స్వస్తివాచనం చేసి స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. 12.16 గంటలకు మాంగళ్యధారణ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించి దంపతులను ఒకచోటుకు చేర్చారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. భక్తులు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించి భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. స్వామివారు కల్యాణోత్సవం సందర్భంగా గజవాహనంపై వచ్చి భక్తులను అనుగ్రహించారు. కల్యాణోత్సవంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ సదారాం, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయిని నరసింహమూర్తి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, ఆలయ ఉద్యోగులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాత్రి కొండకింద ఉన్న పాత జెడ్పీ హైస్కూల్లో భక్తుల కోసం వైభవోత్సవ కల్యాణం జరిగింది. ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తున్న గవర్నర్ దంపతులు -
వెంకన్న సన్నిధిలో గవర్నర్ దంపతులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి విమలా నరసింహన్ కూడా ఉన్నారు. గవర్నర్ దంపతులకు టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సహా పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఓటుకు కోట్లు వ్యవహారంపై ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గడిచిన కొద్దిరోజులగా గవర్నర్ తీరిక లేకుండా గడిపిన సంగతి తెలిసిందే. -
చీపురు పట్టిన గవర్నర్ దంపతులు
-
స్కూల్ లో బెంచీలు తుడిచిన గవర్నర్
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ దంపతులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్‌భవన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ దంపతులు గురువారం ఉదయం పాల్గొని రోడ్డును ఊడ్చారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. రాజ్‌భవన్ కాలనీలోని ఓ స్కూల్, కమ్యూనిటీ హాలులో బెంచీలు తుడిచారు.. ఉద్యోగులు చేత క్లీన్ ఇండియా ప్రమాణం చేయించారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని నరసింహన్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్నినిర్మిద్దామని ఆయన కోరారు. క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ మన టార్గెట్ కావాలని నరసింహన్ సూచించారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టు ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకునేందుకు శ్రమదానం చేయడం వల్ల పరిశుభ్రమైన భారత్‌ను సాధించేందుకు వీలుపడతుందన్నారు.