'కెప్టెన్' యోగ ముద్రలు కేక! | captain vijaykanth performs yoga in a different style | Sakshi
Sakshi News home page

'కెప్టెన్' యోగ ముద్రలు కేక!

Published Tue, Jun 23 2015 3:32 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

'కెప్టెన్' యోగ ముద్రలు కేక!

'కెప్టెన్' యోగ ముద్రలు కేక!

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సహా అగ్రనేతలంతా రాజ్పథ్ వద్ద యోగముద్రలు ప్రదర్శించారు. తమిళనాడులో కూడా దీన్ని గట్టిగా ప్రమోట్ చేయాలని కొన్ని పార్టీలు భావించాయి. ముఖ్యంగా అలనాటి హీరో కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే యోగా దినోత్సవాన్ని బాగా ఉపయోగించుకోవాలని అనుకుంది. ఇందుకోసం యోగముద్రలో ఉన్న విజయకాంత్ ఫొటోతో పెద్ద పోస్టర్ కూడా వేయించారు.

అయితే అప్పుడే అసలు కథ మొదలైంది. వెండితెర మీద అద్భుతమైన ఫైట్లు చేసే విజయకాంత్.. యోగా దినోత్సవంలో కూడా అందరికీ సూచనలు ఇస్తారని అంతా భావించారు. కానీ, చిన్న చిన్న ముద్రలు చేయడానికి కూడా ఆయన అటూ ఇటూ అందరివైపు చూడటం కనిపించింది. అలాగే ప్రాణాయామం లాంటి చిన్న చిన్నవాటిని కూడా ఆయన సొంతంగా చేయలేకపోయారు. వేరేవాళ్లు యోగముద్రలు ప్రదర్శిస్తుంటే.. వాళ్లవైపు చూసి చేతులు అటూ ఇటూ ఊపడం తప్ప.. పోస్టర్లో చూపించిన యోగాను ఎక్కడా ఆయన ఆచరించి చూపించలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement