డల్లాస్‌లో మూడవ అంతర్జాతీయ యోగా డే | 3rd International Yoga Day under the MGMNT | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో మూడవ అంతర్జాతీయ యోగా డే

Published Mon, Jun 19 2017 1:25 PM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

డల్లాస్‌లో మూడవ అంతర్జాతీయ యోగా డే

డల్లాస్‌లో మూడవ అంతర్జాతీయ యోగా డే

డల్లాస్ టెక్సాస్: ఎంజీఎంఎన్‌టీ, కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా  దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. మూడవ అంతర్జాతీయ యోగా  దినోత్సవాన్ని జూన్ 25, 2017, (ఆదివారం) ఉదయం 7:30 - 9:30  వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

యోగా చేయడానికి కావలసిన మాట్స్ ను పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఉచిత ప్రవేశం, అల్పాహార ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ వేడుకల్లో  పాల్గొనే వారు  ముందుగా వచ్చి ఒక పద్దతిలో తమ వాహనాలను పార్క్ చేసుకోవలసిందిగా కోరారు.  ఈ కార్యక్రమానికి   టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు మాట్ రినాల్డి, ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టోప్ఫర్ ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు.

ఈ యోగా ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని యోగా, ధ్యానంలో ఉన్న  మెలకువలను నేర్చుకొని దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా చేస్తూ  శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవాలని ఆయన కోరారు. వివరాల కోసం  ఎంజీఎంఎన్‌టీ.ఓఆర్‌జీ (www.mgmnt.org), ఎంజీఎంఎన్‌టీ  బోర్డు సభ్యులను  సంప్రదించండి.

డాక్టర్ ప్రసాద్ తోటకుర - 817-300-4747, పియుష్ పటేల్ - 214-850-9828, రావు కల్వల -732-309-0621, సల్మాన్ ఫర్షోరి - 469-585-2104, తయాబ్ కుందవాలా - 469 -733-0859, శ్రీమతి షబ్నం మోడ్గిల్-214-675-1754, జాన్ హామండ్  - 972-904-5904,  కమల్ కౌషల్ - 972-795-2328 , లాల్ దస్వాని – 214-566-3111

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement