MGMNT
-
గాంధీ మునిమనవడు మృతికి నివాళులు
టెక్సాస్: కరోనా కారణంగా చనిపోయిన మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా మృతి పట్ల మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ రెండో కుమారుడు మణిలాల్, సుశీలాబెన్ల కుమార్తె సీతా, శశికాంత్‌ల తనయుడు సతీష్ ధుపేలియా దక్షిణాఫ్రికాలో మృతి చెందారని తెలిపారు. గత నెల రోజులగా న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలోనే ఆస్పత్రిలో కరోనాసోకి నవంబర్ 22న మృతి చెందడం విచారకరమన్నారు. మూడు రోజులక్రితమే సతీష్ ఆస్పత్రిలో తన 66 వ జన్మదినాన్ని జరుపుకున్నారన్నారు. 2014 లో అక్టోబర్ 2 వ తేదిన అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ను డల్లాస్‌లో సతీష్ చేతులమీదుగా ఆవిష్కరణ జరుపుకోవడం ఒక మధురానుభూతని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన శిల్పి బుర్రా శివ వరప్రసాద్ తయారుచేసిన ఆ మహాత్మాగాంధీ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోందని సతీష్ ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉన్న నాలుగు రోజులు డల్లాస్‌లో అనేక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. (చదవండి: సియాటిల్‌లో ప్రవాస భారతీయుల వర్చువల్ భేటీ) గాంధీ మునిమనవడు సతీష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఎమ్జీఎమ్ఎన్టీ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరతో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రావు కల్వల, మురళి వెన్నం, జాన్ హేమండ్, రన్నా జాని, అభిజిత్ రాయల్కర్, స్వాతి షా, శైలేష్ షా, లోక్ నాథ్ పాత్రో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన సతీష్ వృత్తి పరంగా మీడియా ఫోటోగ్రాఫర్‌గా, వీడియో గ్రాఫర్‌గా పని చేశారు. ప్రవృత్తి పరంగా మహాత్మాగాంధీ 1904లో స్థాపించిన ఫేనెక్ష్ సెటిల్మెంట్లో, డర్బాన్ దగ్గరలో ఉన్న సంస్థలోను, గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్‌లోనూ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు. సతీష్‌కు ఉమ, కీర్తి అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. (చదవండి:అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?) -
డల్లాస్‌లో ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు
డల్లాస్ : అమెరికాలోని డల్లస్ ప్రాంతంలో మహాత్మగాంధీ మొమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్(ఎమ్‌జీఎమ్‌ఎన్‌టి) ఆధ్వర్యంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 400 మంది భారతీయ అమెరికన్లు ఈ వేడుకకు ఎంతో ఉత్సాహంతో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌జీఎమ్‌ఎన్‌టిచైర్మన్ ప్రసాద్ తోటకూర, సెక్రటరీ రావు కాల్వల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అభిజిత్ రాయిల్కర్, శైలేష్ షా, తదితరులు హాజరయ్యారు. చైర్మన్ తోటకూర ప్రసాద్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను అక్కడున్న అందరికి వివరించారు. భారతదేశం గణతంత్రం సాధించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయమని ప్రసాద్ తెలిపారు. కార్యక్రమం చివర్లో ఎమ్‌జీఎమ్‌ఎన్‌టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శైలేష్ షా మాట్లాడుతూ.. జనవరి 30న మహాత్మగాంధీ వర్ధంతి పురస్కరించుకొని జాతిపితకు ఘనమైన నివాళులు అర్పించేందుకు అందరూ రావాల్సిందిగా కోరారు. -
డాలస్ లో ఘనంగా గాంధీజీ 15౦ వ జయంతి ఉత్సవాలు
ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అనే నానుడి వాస్తవం కాదని నిరూపిస్తూ గాంధీజీతో సమానంగా ఆయన పక్కనే నడుస్తూ సత్యాగ్రహంతో పాటు మరెన్నో విషయాల్లో కస్తూర్బాగాంధీ ఎంతో తోడ్పాటును అందించారని మహాత్మా గాంధీ మనవరాలు ఈలా గాంధీ పేర్కొన్నారు. డాలాస్లోని పార్క్‌ప్లాజాలో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్ముని 150వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మహాత్ముని జీవిత గాథలపై గాక ఆయన సతీమణి కస్తూర్బాగాంధీ జీవితంపై చక్కని ప్రదర్శనతో కూడిన ప్రసంగాన్ని వినిపించారు. 13ఏళ్ల వయస్సులో గాంధీజిని వివాహం చేసుకున్న కస్తుర్బా.. ఏనాడూ బడికి పోలేదన్నారు. గాంధీజీ చొరవతో ఆయన శిక్షణలోనే చదువుకున్న కస్తూర్భా.. భర్తతో కలిసి దక్షిణాఫ్రికా వలస వెళ్లాక అక్కడి భారతీయులకు వ్యతిరేకంగా అమలులో ఉన్న జాతి వివక్ష చట్టాలపై ఆమె చేసిన పోరాటాల గురించి వివరించారు. 1942-44 మధ్య కాలంలో ఆమె జీవిత చివరి దశలో బాపూజీతో కలిసి గడిపిన జైలు జీవితంపై ఈలా గాంధీ సుదీర్ఘంగా ప్రసంగించి పలు ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. బాహ్యప్రపంచానికి గాంధీజీ మహాత్ముడేమో గానీ, ఇంట్లో మాత్రం ఆమె శక్తిమంతురాలని, బాపూజీకి సత్యాగ్రహాన్ని, దాని శక్తిని పరిచయం చేసిన తొలి వ్యక్తి కస్తుర్బా అని ఈలా గాంధీ పేర్కొన్నారు. మహిళా చైతన్యం, మహిళా సాధికారత వంటి అంశాల పట్ల ఆ రోజుల్లోనే ఎంతో అవగాహన కలిగిన తన నాయినమ్మ కస్తుర్బా గాంధీ నేటి మహిళలకు తప్పక ఆదర్శంగా నిలుస్తుందని ఈలా గాంధీ ఆశాభావం వ్యక్తపరిచారు. ఎంజీఎంఎన్టీ రూపొందించిన ప్రత్యేక సంచికను ముఖ్య అతిధి ఈలా గాంధీ ఆవిష్కరించారు. అనంతరం ఆమెను ఎంజీఎన్టీ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అహింసయే శాంతి- శాంతియే శక్తి-శక్తియే ఆనందం-ఆనందమే ఐకమత్యం ఈలా గాంధీ ప్రసంగానికి పూర్వం ఎంజీఎంఎన్టీ ఛైర్మన్ డా. తోటకూర ప్రసాద్ ప్రసంగిస్తూ.. కస్తుర్బా గాంధీ 150వ జయంతి కూడా ఇదే సంవత్సరం కావడం విశేషమని అన్నారు. సోషల్ మీడియాలు, వైరల్ వీడియోలు లేని రోజుల్లోనే కోట్ల మందిని అహింసా, సత్యాగ్రహం, క్రమశిక్షణ వంటి శాంతియుతమైన నినాదాలతో కదిలించిన మహిమాన్వితుడు మహాత్మా గాంధీ అని, ఆయన 150వ జయంత్యుత్సవాలను డల్లాస్‌లో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నోబెల్ విజేతలకు, దేశాధినేతలకు, ప్రపంచ ప్రముఖులకెందరికో గాంధీజీ సిద్ధాంతాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. గాంధీజి ఆశయాలు, ఆదర్శాలు మరో 150ఏళ్లు విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతాయని డా. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. 2014 లో అమెరికా దేశంలో కెల్లా అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారకస్థలిని డాలస్ (ఇర్వింగ్)లో ఏర్పాటు చేయడానికి సహకరించిన ఇర్వింగ్ పట్టణ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసి భారీ విరాళాలు అందించిన దాతలను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి డా. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అహింసతోనే శాంతి సాధ్యమని, గాంధీజి సిద్ధంతాలు ఎల్లవేళలా ఆదర్శనీయమని వెల్లడించారు. గాంధీజి నిర్దేశించిన మార్గంలో అందరూ నడవాలని తద్వారా ఐకమత్యం భాసిల్లుతుందని అన్నారు.పుదుచ్చెరి ఆరోగ్య శాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ యానాంలో ఒక పెద్ద పార్కులో 11 కోట్ల రూపాయిల వ్యయంతో అతిపెద్ద గాంధీజి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, జనవరిలో దాన్ని గాంధీ పార్కుగా నామకరణం చేస్తున్నామని ప్రకటించారు.స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రీసెర్చ్ సెంటర్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ క్లేబోర్న్ కార్సన్ మాట్లాడుతూ.. మార్టిన్ లూథర్ కింగ్ కు గాంధీజి చూపిన ఆశయాలు, సిద్ధాంతాలు మార్గదర్శకమని, ఆ శాంతి బాటలోనే అమెరికాలో ప్రజాహక్కుల ఉద్యమాలను కింగ్ నిర్వహించారని పేర్కొన్నారు. గాంధీ కింగ్ ఫౌండేషన్ ఛైర్మన్ గొల్లనపల్లి ప్రసాద్ మాట్లాడుతూ గాంధీజి జీవితాన్ని అనుసరించి అందరూ శాంతియుత జీవితాన్ని ఆస్వాదించాలని కోరారు. బాపూజీ పై ప్రత్యేకంగా నృత్యశక్తి డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. గుజరాత్ నుండి వచ్చిన ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోని గాంధిజీ పై ప్రత్యేకంగా రూపొందించిన చిత్ర ప్రదర్శన అందరి మెప్పును పొందింది. ఎంజిఎంఎన్టి కార్యవర్గ సభ్యులు జిగర్ సోనిను, అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహ శిల్పి బుర్ర శివవరప్రసాద్ ను సతిసమేతంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో హోస్ట్ కమిటీ సభ్యులైన రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్, మురళి వెన్నం, శాంటే చారి, జాన్ హామొండ్, రాజేంద్ర వంకవాల, శ్రీధర్ తుమ్మల లను ఎంజిఎంఎన్టి బోర్డు ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన కార్యకర్తలు డా. పులిగండ్ల విశ్వనాధం, దినేష్ హూడా, అనిల్ రాతే, మహేందర్ రావు, రాజీవ్ కామత్, ఉర్మిత్ సింగ్ లను ఎంజిఎంఎన్టి అభినందించింది. ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కల్వల తన స్వాగతోపన్యాసంలో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను వందలాది అభిమానుల మధ్య ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని, గాంధీజీ చూపిన బాటలోనే యువతరం కూడా ప్రపంచవ్యాప్తంగా నడవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తో పాటు బోర్డు సభ్యులు బీఎన్ రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, తైయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయాద్, కమల్ కౌషల్, అభిజిత్ రాయల్కర్ పాల్గొన్నారు. -
మహాత్మా గాంధీకి ఎంపీ లింగయ్య యాదవ్ ఘన నివాళి
డాలస్ : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ డాలస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించి పుష్పగుచ్చాలతో జాతిపితకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యడు లింగయ్య మాట్లాడుతూ 18 ఎకరాల సువిశాలమైన పార్కులో యావత్ ప్రపంచం గర్వించే విధంగా ఇంత భారీ మెమోరియల్‌ను నిర్మించడంలో కీలక పాత్ర వహించిన గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర కృషిని అభినందించారు. ప్రపంచ శాంతిదూత మహాత్మా గాంధీ ఎటువంటి ఆయుధాలు వాడకుండానే భారతదేశాన్ని బ్రిటిష్ దాస్య సుంఖలాలనుంచి విముక్తి చేసిన ఒక గొప్ప నేత అని, ఆయన ఆశయాలను, కార్యదీక్షను స్ఫూర్తిగా తీసుకుని అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలాలాంటి ఎంతో మంది నాయకులు ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా ఉద్యమాలను జరిపి తమ జాతి సమస్యలను సాధించుకున్న తీరు ఎంతైనా అభినందనీయమని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో డాలస్‌లో ఉన్న ఈ మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించి నివాళులర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డు సభ్యులు, దాతలు, ఇర్వింగ్ పట్టణ అధికారుల కృషిని పార్లమెంట్ సభ్యులు లింగయ్య యాదవ్ ప్రశంసించారు. ఈ పర్యటనలో లింగయ్య యాదవ్ తో పాటు కొలబెర్రి సంస్థ వ్యవస్థాపకుడు ఆనంద్ దాసరి, డా. రమేష్ బండగొర్ల, బలరాం యాదవ్ కాసుల, నాగరాజు తాడిబోయిన, రామ్మోహన్ అమాస పాల్గొన్నారు. -
డాలస్‌లో 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'
డాలస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. దాదాపు 300 మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ ముఖ్య అతిథిగాను, కాన్సుల్ రాకేష్ బనాటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సంస్థ కార్యదర్శి రావు కల్వల అతిథులకు స్వాగతం పలికి, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సంస్థ ఉపాధ్యక్షుడు బి.ఎన్ రావుమాట్లాడుతూ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రధాన వేధిక కావడం సంతోషంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యోగా అనే ప్రక్రియను భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప కానుక అన్నారు. యోగా చేయడానికి వయస్సు, జాతి, మతం, కులం అడ్డు కావని అందుకే 170 దేశాలకు పైగా కోట్లాది ప్రజలు జూన్21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని అన్నారు. యోగా సంవత్సరానికి ఒక సారి వచ్చే పండుగలా కాకుండా దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు. ఈ యోగాను ఇర్వింగ్ నగరంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఇర్వింగ్ మేయర్‌కు సూచించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఎన్నో దేశాల ప్రజలు యోగాను తమ జీవితాలలో ఒక ముఖ్య భాగంగా చేసుకోవడం విశేషమని, యోగాను ఆవిష్కరించిన భారతదేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాన్సుల్ రాకేష్ బనాటి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించటంతో ప్రపంచవ్యాప్తంగా యోగా జరువుకోవడం భారతదేశానికి గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డాలస్ విద్యార్థులకు మహాత్మా గాంధీ మెమోరియల్ సంస్థ 2,000 డాల్లర్ల స్కాలర్షిప్ను యూనివర్సిటీ ఏషియా సెంటర్ డైరెక్టర్ మోనిక్ వేడేర్బర్న్ కు మేయర్ చేతుల మీదుగా అందజేశారు. “92వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో” విజేతలుగా నిలిచిన అభిజాయ్ కొడాలి, సోహుమ్ సుఖతన్కర్, రోహన్ రాజాలను, వారి తల్లిదండ్రులను డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు, మేయర్ రిక్ స్టొఫర్, కాన్సుల్ రాకేష్ బనాటిలు ఘనంగా సత్కరించారు. దాదాపు రెండు గంటల పాటు యోగా గురువులు విజయ్, పెగ్గీ నేతృత్వంలో యోగాలోని మెళకువలను ఉత్సాహంగా ప్రవాస భారతీయులు నేర్చుకొని సాధన చేశారు. సంస్థ కోశాధికారి అభిజిత్ రాయిల్కర్ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన స్వచ్చంద సేవకులకు, విచ్చేసిన అతిధులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రఫీ, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసిన వారికి, వాటర్ బాటిల్స్ ఉచితంగా అందజేసిన సరిగమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన వారందరికీ గాంధీ మెమోరియల్ సంస్థ వారు యోగ్యతా పత్రాలను, అల్పాహారం అందజేశారు. -
డాలస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
డాలస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాన్సులేట్ ఆఫ్ ఇండియా హౌస్టన్ వారి సహకారంతో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జూన్ 22న ఉదయం 7:30 నుండి 9:30 వరకు మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా, ఇర్వింగ్ నగరంలో నిర్వహిస్తున్నట్టు ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ హ్యూస్టన్ డా. అనుపమ్ రే ప్రత్యేక అతిథిగా పాల్గోనున్నారు. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన 92వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్స్ గా ఎనిమిది మంది గెలిస్తే, అందులో ఏడుగురు భారతీయ సంతతికి చెందిన వారు కావడం ఎంతో గర్వకారణంగా ఉందని ప్రసాద్ తోటకూర అన్నారు. వారిలో డల్లాస్ నుంచి గెలిచిన అభిజాయ్ కొడాలి, సోహుమ్ సుఖతన్కర్, రోహన్ రాజాలను సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి యోగా చేయడానికి యోగా మాట్స్, అల్పాహారంను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలోని ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థకు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా జాన్ హేమండ్, బి.ఎన్. రావు, రావు కాల్వల, అభిజిత్ రాయిల్కర్, తాయబ్ కుండవాలా, అక్రమ్ సయ్యద్, పీయూష్ పటేల్, కమల్ కౌషల్ భాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు www.mgmnt.org ను సంప్రదించాలని, ఈ యోగా దినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఉగ్రదాడికి నిరసనగా డల్లాస్‌లో కొవ్వొత్తులతో ర్యాలీ
డల్లాస్: కాశ్మీర్‌లోని పుల్వామా వద్ద ముష్కరుల దాడికి నిరసనగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం 5.00 గంటలకు వీర మరణం పొందిన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నట్లు ఎమ్జీఎమ్ఎన్టీ సభ్యులు తెలిపారు. ఈ ర్యాలీకి భారీ ఎత్తున ప్రజలు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించాలని ఎమ్జీఎమ్ఎన్టీ ఫౌండర్ డా. ప్రసాద్ తోటకూర కోరారు. మరింత సమాచారం కోసం www.mgmnt.orgకు లాగిన్ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో -
డల్లాస్‌లో ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
డల్లాస్ : భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్ద గాంధీ స్మారకంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని సంస్థ కార్యదర్శి కాల్వల రావు సాదరంగా ఆహ్వానించారు. సంస్థ చైర్మన్ డా.తోటకూర ప్రసాద్ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల సేవలను గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని రూపోందించిన డాక్టర్ అంబేడ్కర్, జవహార్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యాం ప్రసాద్ ముఖర్జీలను గుర్తించుకోవాలన్నారు. వీరంతా మూడేళ్లపాటు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపోందించారని తెలిపారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించామని.. చేయాల్సింది ఇంకా ఉందని గుర్తుచేశారు. భారతీయ అమెరికన్లుగా రెండు దేశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.సంస్థ కోచైర్మన్ బీఎన్.రావు మాట్లాడుతూ.. స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి మరవలేదన్నారు. వేడుకలను ముఖ్యఅతిథిగా ఇర్వింగ్ పట్టణ డిప్యూటీ మేయర్ ఆస్కార్ వార్డ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్ వార్డు మాట్లాడుతూ..ఉన్నత సమాజ నిర్మాణంలో భారతీయులు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇర్వింగ్ కౌన్సిల్ సభ్యుడు ఆలన్ మేగర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్, అతి పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఈ వేడుకల్లో ఎమ్జీఎమ్ఎన్టీ కోశాధికారి అభిజిత్ రాయ్‌కర్‌తో పాటు దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
డల్లాస్ : మహాత్మాగాంధీ 149వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో 'గాంధీ పీస్ వాక్' నిర్వహించారు. చిన్నా పెద్దా తేడాలేకుండా టీషర్టులు, టోపీలు ధరించి గాంధీ పీస్ వాక్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విప్రో సీఈఓ అబిదలి నీముచ్‌వాలాతోపాటూ ఆయన భార్య హస్నేవా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇర్వింగ్ నగర కౌన్సిల్ మెంబర్ అల్లెన్ మీగర్, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మాట్ రినాల్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీస్ వాక్‌లో భారీ ఎత్తున ప్రజలు పాల్గొనడం ఆదర్శంగా నిలిచిందని ఎమ్జీఎమ్ఎన్టీ సెక్రటరీ రావు కల్వల అన్నారు. ఐఏఎన్టీ, ఐఏఎఫ్‌సీ, ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డు సభ్యులు, అతిథులను ఎమ్జీఎమ్ఎన్టీ కోశాధికారి బీఎన్ పరిచయం చేశారు. గాంధీ ఆశయాలు అజరామరమని, దేశం కోసం జీవితాన్ని త్యాగం చేయడంతో గాంధీని మహాత్మునిగా నేటికీ గౌరవిస్తున్నామని, తరతరాలకు గాంధీ ఆదర్శంగా నిలిచారని ఎమ్జీఎమ్ఎన్టీ కో చైర్ కమల్ కౌశల్ పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించినవారికి, ఇర్వింగ్ నగర ప్రజలకు ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డు డైరెక్టర్ కుంతేష్ చోక్సీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసినవారికి మాట్ రినాల్డిని ఆయన పరిచయం చేశారు. భారత్ నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు దూరం వచ్చి గాంధీ జయంతి వేడుకలకు వేలాదిమంది కలిసి జరుపుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉందని ప్రశంసించారు. భారత్, అమెరికా మధ్య ప్రజాస్వామ్యం, రక్షణ వంటి సారూప్యతలు ఉన్నాయన్నారు. టెక్సాస్ అభివృద్ధికి కారణమవుతున్న అమెరికా, భారత్ సహకారాన్ని ఆయన అభినందించారు. వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమానికి హాజరవ్వడం ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నానని ఇర్వింగ్ సిటీ కౌన్సిల్ మెంబర్ అల్లెన్ మీగర్ అన్నారు. ఇర్విన్ నగర ఆర్థిక వృద్ధి కోసం భారతీయ అమెరికన్ల సహకారాన్ని ఆయన ఆకాంక్షించారు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద గాంధీ మెమోరియల్‌ను నిర్మించి, నిర్వహిస్తున్న ఎమ్జీఎమ్ఎన్టీ చైర్మన్ డా. ప్రసాద్ తోటకూరతోపాటు బృంద సభ్యులను అబిదలి నీముచ్వాలా ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచిన మహాత్మ గాంధీ అడుగు జాడల్లో నడవడం ఎంతోగౌరవప్రదమైనదని ఆయన కొనియాడారు. ఎమ్జీఎమ్ఎన్టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. తామందరం కలిసి మహాత్మ గాంధీ 149వ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందకరమన్నారు. గాంధీ 150 జయంతి వేడుకలను మరింత ఘనంగా జరపడం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. గాంధీ తన జీవితంలో అధిక భాగం భారత స్వాతంత్ర్య కోసం పోరాటం చేసినా ఆయన సిద్ధాంతాలు ప్రపంచ పౌరుడిగా నిలిపాయని కొనియాడారు. భారతీయ అమెరికన్లుగా తమ బాధ్యత మరింత పెరిగిందని, భారత్‌తోపాటు అమెరికాలోని తమవారి ఎదుగుదల కోసం పాటుపడాలని సూచించారు. తమ స్వరాన్ని గట్టిగా వినిపించేందుకు అర్హత కలిగిన వారు ఓటు వేయాల్సిన బాధ్యత ఉందన్నారు. నాలుగు పార్క్ బెంచీలు దానం చేసిన లాంక్వింటా ఇన్, సేజ్ ఐటీ, అదిల్ అది కుటుంబం, ఉపేంద్ర ఓర కుటుంబాలకు ప్రసాద్ తోటకూర ధన్యవాదాలు తెలిపారు. బెంచీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతికి సూచకంగా మొత్తం 10 పావురాలను గాలిలో వదిలేశారు. యోగా టీచర్ విజయ్ నిర్వహించిన వార్మప్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అనంతరం పూలతో గాంధీకి నివాళులు అర్పించారు. హాజరైనవారందరికీ అల్పాహారం అందించారు. ఐఏఎన్టీ టీం రాజా బెలాని, అబిజిత్ రైల్‌కర్, జగదీష్ బంకర్, రహూల్ చటర్జీ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎమ్జీఎమ్ఎన్టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు
డల్లాస్ : మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ), కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నాల్గవ అంతర్జాతీయ యోగా వేడుకలను నిర్వహించనున్నాయి. జూన్17వ తేదిన డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనుపమ రాయ్, ఇర్వింగ్ మేయర్ మీఘర్ హాజరుకానున్నారు. జూన్17వ తేదిన ఉదయం 7:30 నుంచి 9:30 వరకు కార్యక్రమం కొనసాగనుంది. యోగాలో పాల్గొనే వారికి ఉదయం ఫలహారంతో పాటు యోగా మ్యాట్లను కూడా నిర్వాహకులే అందజేస్తారు. -
గాంధీ తత్వాలు అజరామరం : నిక్కి హేలీ
డల్లాస్ : ఉత్తర టెక్సాస్‌లో ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపాన్ని ఐక్యరాజ్యసమతిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ సందర్శించారు. మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోట కూర నిక్కి హేలీని సాదరంగా ఆహ్వానించారు. మహాత్మా గాంధీ తత్వాలు, ఆయన ఆచరించిన నియమాలు అజరామరమని నిక్కి హేలీ కొనియాడారు. ఎమ్జీఎమ్ఎన్టీలో గాంధీ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు. ఎమ్జీఎమ్ఎన్టీకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మే 2014 లో సౌత్ కరోలినా గవర్నర్‌గా ఉన్న సమయంలో ఎమ్జీఎమ్ఎన్టీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2014, అక్టోబర్ 2న అమెరికాలోనే అత్యంత ఎత్తైన గాంధీ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గాంధీజీ మునిమనవడు సతీష్ దుపెలియా వచ్చారు. ఎమ్జీఎమ్ఎన్టీ ప్రాజెక్టు సాకారంలో ముఖ్యపాత్ర వహించిన డాక్టర్ ప్రసాద్ తోట కూర, ఎమ్జీఎమ్ఎన్టీ టీం, కమ్యునిటీ సభ్యులు, ఇర్వింగ్ నగర అధికారులను నిక్కి హేలీ అభినందించారు. ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డ్ డైరెక్టర్స్ రావు కల్వల, కమల్ కౌషల్, జాన్ హమ్మాండ్, తయ్యబ్ కుందావాలా, పియూష్ పటేల్, నరసింహ భక్తుల, కుంతేష్ చాక్సి, శబ్నమ్ మాడ్గిల్, జాక్ గోద్వానీ, ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్, అలెన్ మీగర్, క్రిస్ హిల్మన్, పార్క్స్, జొసెఫ్ మోసెస్‌లు ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో ఉన్నారు. -
డల్లాస్‌లో ‘ఘన’తంత్ర వేడుకలు
డల్లాస్ : భారత 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరం నడిబొడ్డున గాంధీ మెమోరియల్ స్వప్నం సాకారానికి కృషి చేసిన వారందరిని ఎమ్జీఎమ్ఎన్టీ సెక్రటరీ రావు కల్వల కొనియాడారు. గణతంత్ర వేడుకకు వచ్చిన వారందరికీ స్వాగతం పలికి, ఎమ్జీఎమ్ఎన్టీ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్జీఎమ్ఎన్టీ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోట కూర భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ అంటూ ప్రతి మతానికి ఓ గ్రంథం ఉందని, కానీ భారత పౌరులందరికి కలిపి ఒకే గ్రంథం ఉందని అది రాజ్యాంగమని తెలిపారు. ఈ పవిత్ర గంథం పౌరుల సూత్రాలు, విధానాలు, అధికారాలు, విధులు, బాధ్యతలు మరియు ప్రాథమిక హక్కులను నిర్వచిస్తుందన్నారు. రాజ్యాంగమే సుప్రీమని, ప్రతి పౌరుడు రాజ్యాంగం యొక్క విలువలను అర్ధం చేసుకోని అనుసరించాలన్నారు. రాజ్యాంగాన్ని రూపోందించిన డాక్టర్ అంబేడ్కర్, జవహార్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యాం ప్రసాద్ ముఖర్జీలను గుర్తించుకోవాలన్నారు. వీరంతా మూడేళ్లపాటు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపోందించారని తెలిపారు. గాంధీ విగ్రహానికి ఎమ్జీఎమ్ఎన్టీ డైరెక్టర్ కమల్ కౌశల్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. మరో డైరెక్టర్ షబ్నమ్ మోడ్గిల్ గాంధీ వర్థంతిని పురస్కరించుకొని జనవరి 30న అందరం మళ్లీ కలుసుకుని మహాత్ముడికి నివాళులు అర్పిద్దామని పేర్కొన్నారు. ఈ వేడుకలకు అమెరికాలోని భారత పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
డల్లాస్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలు
డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లో అతిపెద్ద మహాత్మాగాంధీ స్మారక విగ్రహం వద్ద 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇర్వింగ్‌లోని గాంధీ ప్లాజా వద్ద వేలాది మంది ప్రవాస భారతీయులు, వందలాదిగా చిన్నారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బోర్డు డైరెక్టర్ షబ్నమ్ మోడ్గిల్ ప్రారంభించారు. జాతిపిత బాపూజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఎంజీఎంఎన్టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారత జాతీయ పతాకానికి సెల్యూట్ చేసిన ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం నిండుగా ఉండే అమెరికాలో 71 భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్రిటీష్ బానిస సంకెళ్లనుంచి దేశానికి విముక్తి కల్పించిన గాంధీజీ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులైన సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లబాయ్ పటేల్ ల సేవలను కొనియాడారు. అమెరికా, భారత్ ల మధ్య బంధం బలపడాలని ఆకాంక్షించారు. ఎంజీఎంఎన్టీ సెక్రటరీ రావు కల్వల మాట్లాడుతూ.. గాంధీ మెమోరియల్ వద్ద ఈ వేడుకలను జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలైన శాంతి, అహింస మార్గాలను అనుసరించాలన్నారు. అక్టోబర్ 1న ఇదే వేదిక వద్ద జరగనున్న గాంధీ శాంతి పాదయాత్రలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన ఎన్ఆర్ఐలకు, వారి పిల్లలకు, వాలంటీర్లకు ఎంజీఎంఎన్టీ కో చైర్మన్ సల్మాన్ ఫర్షోరి ధన్యవాదాలు తెలిపారు. భారత నేవీ మాజీ కమాండర్ గవి కుమార్, భారత ఆర్మీ మేజర్ రాజ్ దీప్‌లను స్పెషల్ గెస్ట్లుగా ఆహ్వానించారు. ఎన్ఆర్ఐలు ముఖ్యంగా చిన్నారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తీరును గవి కుమార్ ప్రశంసించారు. ఎంజీఎంఎన్టీ బృందం రెండు పార్కు బెంచీలను ఆవిష్కరించి కందూరి ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎంఎన్టీ బృందం సభ్యులు ఎంవీఎల్ ప్రసాద్, మన్హర్ మేఘని, తాయిబ్ కుందావాలా, పీయుష్ పటేల్, బీఎన్, బినజీర్ అర్ఫీ, రెహమన్, సూరి త్యాగరాజన్, జాక్ గోధ్వానిలు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో మూడవ అంతర్జాతీయ యోగా డే
డల్లాస్ టెక్సాస్: ఎంజీఎంఎన్టీ, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 25, 2017, (ఆదివారం) ఉదయం 7:30 - 9:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. యోగా చేయడానికి కావలసిన మాట్స్ ను పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఉచిత ప్రవేశం, అల్పాహార ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే వారు ముందుగా వచ్చి ఒక పద్దతిలో తమ వాహనాలను పార్క్ చేసుకోవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు మాట్ రినాల్డి, ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టోప్ఫర్ ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు. ఈ యోగా ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని యోగా, ధ్యానంలో ఉన్న మెలకువలను నేర్చుకొని దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా చేస్తూ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవాలని ఆయన కోరారు. వివరాల కోసం ఎంజీఎంఎన్టీ.ఓఆర్జీ (www.mgmnt.org), ఎంజీఎంఎన్టీ బోర్డు సభ్యులను సంప్రదించండి. డాక్టర్ ప్రసాద్ తోటకుర - 817-300-4747, పియుష్ పటేల్ - 214-850-9828, రావు కల్వల -732-309-0621, సల్మాన్ ఫర్షోరి - 469-585-2104, తయాబ్ కుందవాలా - 469 -733-0859, శ్రీమతి షబ్నం మోడ్గిల్-214-675-1754, జాన్ హామండ్ - 972-904-5904, కమల్ కౌషల్ - 972-795-2328 , లాల్ దస్వాని – 214-566-3111 -
డల్లాస్‌లో ‘ఘన’తంత్ర వేడుకలు
డల్లాస్ : భారత 68వ గణతంత్ర దినోత్సవాలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరం నడబొడ్డున గాంధీ మెమోరియల్ స్వప్నం సాకారానికి కృషి చేసిన వారందరిని ఎమ్జీఎమ్ఎన్టీ సెక్రటరీ రావు కల్వల కొనియాడారు. గణతంత్ర వేడుకకు వచ్చిన వారందరికీ స్వాగతం పలికి, ఎమ్జీఎమ్ఎన్టీ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ వర్థంతిని పురస్కరించుకొని జనవరి 30న అందరం మళ్లీ కలుసుకుని మహాత్ముడికి నివాళులు అర్పిద్దామని పేర్కొన్నారు. గాంధీ విగ్రహానికి ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జాన్ హామ్మోండ్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్జీఎమ్ఎన్టీ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోట కూర భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద గుమికూడిన ప్రతి ఒక్కరూ గౌరవ వందనం సమర్పించారు. 'భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాము. భారత జాతి పిత మహాత్మాగాంధీ ఎనలేని కృషి వల్ల 1947 ఆగష్టు15న భారత్‌కు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత మన రాజ్యాంగం అమలులోకి రావడానికి దాదాపు రెండున్నర ఏళ్లు పట్టింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు డాక్టర్ అంబేడ్కర్ కృషి వల్ల 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. పేద, ధనికలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించి పాటించాలి. పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య విలువలను మనం పాటించడం భారత అమెరికన్లుగా గర్వించదగ్గ విషయం' అని డాక్టర్ ప్రసాద్ తోట కూర పేర్కొన్నారు. ఎమ్జీఎమ్ఎన్టీ నాయకులు తయ్యబ్ కుందావాలా, షబ్నమ్ మోడ్గిల్, జాక్ గోద్వానీ, కుంతేష్ చోస్కీ, కమల్ కౌశల్, సూరి తయ్యగరాజన్, బెనజీర్ అర్ఫీలు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. -
ఎమ్జీఎమ్ఎన్టీ ఆధ్వర్యంలో గాంధీజీ 147వ జయంతి
డల్లాస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 2న గాంధీజీ 147వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాంధీజి మునిమనవరాలు అర్చనా ప్రసాద్.. భర్త హరిప్రసాద్‌తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా అసొసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో చేపట్టిన 'గాంధీ పీస్ వాక్' కార్యక్రమంలో చిన్నాపెద్దా అంతా తెలుపువస్త్రాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్జీఎమ్ఎన్టీ డైరెక్టర్ షబ్నం మోడ్గిల్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2ను అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలో డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్నటువంటి వివాదాలకు యుద్ధాలు, గొడవలు పరిష్కారం కాదని కేవలం గాంధీజీ చూపిన శాంతిమార్గం అవసరమని అన్నారు. చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమావేశానికి హాజరైన అర్చనా ప్రసాద్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అర్చనా ప్రసాద్ తన ప్రసంగంలో తండ్రి అరుణ్ గాంధీ స్థాపించిన గాంధీ ఇనిస్టిట్యూట్‌తో తనకు గల అనుబంధాన్ని తెలిపారు. -
డల్లాస్ లో గాంధీ జయంతి వేడుకలు
147వ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా అక్టోబర్ 2న డల్లాస్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజీఎంఎన్టీ) చైర్మన్ డా.తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా నుంచి ఉదయం 8గంటలకు 'గాంధీ శాంతి నడక'(గాంధీ పీస్ వాక్)ను ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త టెక్సాస్(ఐఏఎన్టీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. నడకకు హాజరయ్యే వారికి ఉచితంగా టీ షర్ట్, టోపీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శాంతికి చిహ్నాలైన కొన్ని తెల్ల పావురాళ్లను వాక్ అనంతరం గాల్లోకి వదిలివేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న గాంధీ వార్షిక విందు కార్యక్రమం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు dallas.eknazar.comలో టిక్కెట్లు కోనుగోలు చేయొచ్చని చెప్పారు. విప్రో సీఈవో అబిదాలి నీముచ్వాలా గాంధీ వార్షిక విందుకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం www.mgmnt.org లేదా ఎంజీఎమ్ఎన్టీ బోర్డు తోటకూర ప్రసాద్-8173004747, పీయూష్ పటేల్-2148509828, ఇందూ రెడ్డి మాదండి-2145663159, కల్వల రావు-7323090621, సల్మాన్ ఫర్షోరీ-4695852104, తయబ్ కుంద్వాలా-697330859, మొద్గిల్ షబ్నమ్-2146751754, జాక్ గొద్వాని-9726933826, జాన్ హమ్మోన్డ్- 9729045904 లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
డాలస్ ఎంజీఎంఎన్టీ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు
డాలస్(టెక్సాస్): పైనేమో 90 డిగ్రీల ఫారెన్‌హీట్ ఎండ.. పైగా చేసేది యోగా.. అయినాసరే అందరి మనసుల్లో చల్లటి భావనలు. ఎవరిపేరు పలికితే శాంతి మంత్రం జపించినట్లవుతుందో అలాంటి మహాత్మా గాంధీ పేరిట అమెరికా గడ్డపై ఒక్కటయ్యారు వారంతా. అందుకే ప్రశాంతంగా, నిశ్చయంగా కొనసాగిందా సాధన. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ (ఎంజీఎంఎన్ టీ) ఆధ్వర్యంలో టెక్సాస్ రాష్ట్రం డాలస్ లోని ఇర్వింగ్ పట్టణంలో నిర్వహించిన యోగా సాధనలో దాదాపు 500 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఏఓఎల్) సహకారంతో ఇర్వింగ్ సిటీలోని థామస్ జెఫర్సన్ పార్క్ లో గల మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద జూన్ 19న ఈ కార్యక్రమం జరిగింది. ఎంజీఎంఎన్టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ షబ్నం మోద్గిల్ ఆహ్వానం మేరకు కార్యక్రమాన్ని ఉద్దేశంచి ప్రసంగించిన ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కలవల.. డాలస్ లోని మహాత్ముడి స్మారక స్థలి వద్ద యోగా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని, యోగా డేను ప్రపంచ వ్యాపంగా 350 మిలియన్ల మంది జరుపుకొంటుండగా, అమెరికాలో 35 మిలియన్ల మంది యోగా సాధన చేస్తున్నారని తెలిపారు. అన్నీ తానై యోగా డే వేడుకలను నిర్వహించారంటూ ఎంజీఎంఎన్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూరను అభినందించారు. అమెరికాలోని అన్ని మహాత్ముడి స్మారకాల్లోకీ డాలస్ లోని స్మారక స్థలే పెద్దదిగా అవతరించిందని, ఇండియన్ అమెరికన్ల మధ్య సంబంధాల బలోపేతానికి కూడా ఈ స్థలమే కేంద్ర బిందువుగా మారిదని అన్నారు. ఎంజీఎంఎన్టీ డైరెక్టర్ తాయబ్ కుందావాలా ఆహ్వానం మేరకు కౌన్సిల్ జనరల్ ఆఫ్ హ్యూస్టన్ (టెక్సాస్) డాక్టర్ అనుపమా రాయ్, కౌన్సిల్ రిప్రెసెంటేటివ్ ఆర్.డి. జోషి లు ప్రసంగించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృంద సభ్యులు శ్రీధర్ తుల్జారామ్, డాక్టర్ నిక్ ష్రాఫ్, సపానంద్ లు ఆహుతులకు యోగాభ్యాసం, ప్రాణాయాయం, ధ్యానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు నిర్వహించిన 200 కార్యక్రమాలకు తన సహకారాన్ని అందించిన ఎంజీఎంఎన్టీ బోర్డ్ మెంబర్, కమ్యూనిటీ వాలంటీర్ నగేశ్ దిండికుర్తి సేవలను నిర్వాహకులు గుర్తుచేసుకున్నారు. ఎంజీఎంఎన్టీ కో చైర్ పర్సన్ ఇందు మందాడి ముగింపు ప్రసంగం చేస్తూ ఇర్వింగ్, డాలస్ ల ప్రజానికానికి, ఎలక్టానిక్ మీడియా, సూరజ్ ఆర్ట్స్, ఇషా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్డోబర్ 2 నిర్వహించనున్న శాంతియాత్ర(పీస్ వాక్) లో పాల్గొనవలసిందిగా ఆహుతులను కోరారు. -
డల్లాస్‌లో మొక్కలు నాటిన ఎన్నారైలు
డల్లాస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో టెక్సాస్ ట్రీ ఫౌండేషన్, ఇర్వింగ్ సిటీ, డీఎఫ్‌డబ్ల్యూ కమ్యూనిటీ వారు సంయుక్తంగా మొక్కలు నాటడం కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ రక్షణకు గాంధీ ఎప్పుడు మద్ధతు తెలిపేవారని, 'గాలి, నీరు, భూమి, నేల కేవలం మనవి మాత్రమే కాదు.. మన తర్వాతి తరాలకు మనం వారసత్వంగా వాటిని అందించాలన్న' మహాత్ముని మాటలను మహాత్మాగాంధీ మెమోరియల్ సెక్రటరీ, కన్స్ట్రక్షన్ గ్రూప్ చైర్మన్ కల్వలా రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమ రూపకర్త, గాంధీ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అయిన ప్రసాద్ తోటకూర శ్రమ ఫలితమే ఈ మొక్కల పెంపకం అని ఆయన సేవల్ని కల్వలా రావు కొనియాడారు. పారిస్ ఉగ్రదాడుల మృతుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ నిర్వాహకులు నివాళులు అర్పించారు. పారిస్ దాడుల మృతులకు ప్రసాద్ తోటకూర తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మొక్కల నాటకం కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వందల మంది వాలంటీర్లు టెక్సాస్ అర్లింగ్టన్ యూనివర్సిటీ విద్యార్థులు, మొక్కల స్పాన్సర్స్ గ్రూపు వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.