డల్లాస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 2న గాంధీజీ 147వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇర్వింగ్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాంధీజి మునిమనవరాలు అర్చనా ప్రసాద్.. భర్త హరిప్రసాద్తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా అసొసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో చేపట్టిన 'గాంధీ పీస్ వాక్' కార్యక్రమంలో చిన్నాపెద్దా అంతా తెలుపువస్త్రాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్జీఎమ్ఎన్టీ డైరెక్టర్ షబ్నం మోడ్గిల్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2ను అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
సమావేశంలో డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్నటువంటి వివాదాలకు యుద్ధాలు, గొడవలు పరిష్కారం కాదని కేవలం గాంధీజీ చూపిన శాంతిమార్గం అవసరమని అన్నారు. చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమావేశానికి హాజరైన అర్చనా ప్రసాద్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అర్చనా ప్రసాద్ తన ప్రసంగంలో తండ్రి అరుణ్ గాంధీ స్థాపించిన గాంధీ ఇనిస్టిట్యూట్తో తనకు గల అనుబంధాన్ని తెలిపారు.
ఎమ్జీఎమ్ఎన్టీ ఆధ్వర్యంలో గాంధీజీ 147వ జయంతి
Published Wed, Oct 5 2016 9:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement
Advertisement