డల్లాస్ లో గాంధీ జయంతి వేడుకలు
డల్లాస్ లో గాంధీ జయంతి వేడుకలు
Published Thu, Sep 29 2016 9:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
147వ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా అక్టోబర్ 2న డల్లాస్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజీఎంఎన్టీ) చైర్మన్ డా.తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా నుంచి ఉదయం 8గంటలకు 'గాంధీ శాంతి నడక'(గాంధీ పీస్ వాక్)ను ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త టెక్సాస్(ఐఏఎన్టీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
నడకకు హాజరయ్యే వారికి ఉచితంగా టీ షర్ట్, టోపీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శాంతికి చిహ్నాలైన కొన్ని తెల్ల పావురాళ్లను వాక్ అనంతరం గాల్లోకి వదిలివేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న గాంధీ వార్షిక విందు కార్యక్రమం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు dallas.eknazar.comలో టిక్కెట్లు కోనుగోలు చేయొచ్చని చెప్పారు.
విప్రో సీఈవో అబిదాలి నీముచ్వాలా గాంధీ వార్షిక విందుకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం www.mgmnt.org లేదా ఎంజీఎమ్ఎన్టీ బోర్డు తోటకూర ప్రసాద్-8173004747, పీయూష్ పటేల్-2148509828, ఇందూ రెడ్డి మాదండి-2145663159, కల్వల రావు-7323090621, సల్మాన్ ఫర్షోరీ-4695852104, తయబ్ కుంద్వాలా-697330859, మొద్గిల్ షబ్నమ్-2146751754, జాక్ గొద్వాని-9726933826, జాన్ హమ్మోన్డ్- 9729045904 లను సంప్రదించాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement