'రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో యోగాను ప్రవేశపెడతాం' | yoga produced in all colleges in andhra pradesh | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో యోగాను ప్రవేశపెడతాం'

Published Tue, Jun 21 2016 8:44 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

yoga produced in all colleges in andhra pradesh

విజయవాడ : రాష్ట్రంలోని అన్ని కాళాశాలల్లో యోగాను ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలోని ఎ - కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన యోగా కార్యక్రమంలో చంద్రబాబునాయుడుతోపాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... యోగాకు భవిష్యత్లో మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. మంచి ఆహారం కోసం రాష్ట్రంలో న్యూట్రిషన్ మిషన్ ఏర్పాటు చేశామని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ యోగా కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రి సురేష్ ప్రభు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement