![బియ్యపు గింజలపై యోగాసనాలు](/styles/webp/s3/article_images/2017/09/4/41466459307_625x300.jpg.webp?itok=PfwzeC3S)
బియ్యపు గింజలపై యోగాసనాలు
మైక్రో ఆర్టిస్ట్ అమీర్‌జాన్ ప్రతిభ
నెల్లూరు(బృందావనం): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ షేక్ అమీర్‌జాన్ బియ్యపుగింజలపై యోగాసనాలు చిత్రీకరించారు. ఆయన సోమవారం సాక్షితో మాట్లాడుతూ ఉరుకులు, పరుగుల జీవితంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి యోగాసనాల ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుందన్న సందేశాన్ని ఇస్తూ 24 బియ్యపు గింజలపై 24 ఆసనాలను తీర్చిదిద్దానని పేర్కొన్నారు.