
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. కొత్త విషయాలపై ఆయన వెంటనే స్పందిస్తుంటారు. తాజాగా, ఆయన షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హఫీజ్, హబీబర్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఢిల్లీ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నారు. వారు చెత్తను ఎరుకునే క్రమంలో అలసట తెలియకుండా పాటలు పాడుతూ పనిచేస్తుంటారు. ఈ క్రమంలో వారు ఓ హిందీ పాటను అద్భుతంగా ఆలపించారు. స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు వారు పాడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అది కాస్త ఆనంద్ మహీంద్ర కంటపడటంతో ఆయన యువకుల గానకౌశలాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. వారి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ మహింద్రా ఆ వీడియోను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అంతటితో ఆగకుండా అన్నదమ్ములిద్దరికీ మంచి మెలోడీయస్ వాయిస్ ఉందని అన్నారు. ఢిల్లీలోని సంగీత అధ్యాపకులు సాయంత్రం పూట వారికి కొంత సమయం కేటాయించాలని కోరారు. కాగా.. ఇప్పటికే ఈ వీడియోను పదివేల మందికి పైగా నెటిజన్లు చూశారు. అన్నదమ్ముల దగ్గర టన్నుల కొద్ది ప్రతిభ ఉందని , ఇలాంటి వారికి తప్పకుండా సహకారం అందించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: చెత్తలో వెడ్డింగ్ రింగ్: వెతికిచ్చిన మున్సిపాలిటీ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment