
రామ్‌దాస్ అథావలే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ చేతులు కలిపితే బీజేపీకి భారీ నష్టం తప్పదని వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు దాదాపు 30 లోక్‌సభ స్థానాలు కోల్పోయే ప్రమాదముందని కేంద్ర మంత్రి, ఎన్‌డీఏ మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ(ఏ)) రామ్‌దాస్ అథావలే అభిప్రాయపడ్డారు.యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 73 సీట్లు గెలిచాయి. శుక్రవారం లక్నోలో అథావలే మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎస్పీ, బీఎస్పీ జత కడితే బీజేపీ, దాని మిత్రపక్షాలకు నష్టం తప్పదు.
కానీ, ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి అడ్డంకి కాదు’అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీని, రాహుల్ గానీ, అఖిలేష్ యాదవ్‌గానీ, మాయావతిగానీ సవాల్ చేయలేరని చెప్పారు. లోక్‌సభ ఉప ఎన్నికల్లో మాయావతి ఎస్పీకి మద్దతు ఇవ్వగా.. రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ ఎమ్మెల్యేలు సహకరించకపోవడంతో బీఎస్పీ అభ్యర్థి ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు.
కేంద్ర మంత్రి అథావలే వ్యాఖ్య