'ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మద్దతు అవసరం'
ముంబై: మహారాష్ట్రలో శివసేన మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు చేయడం కష్టమని బీజేపీ మిత్రపక్షం ఆర్పీఐ(రిపబ్లిక్న పార్టీ ఆఫ్ ఇండియా) అభిప్రాయపడింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సీట్లను దక్కించుకోపోవచ్చని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠావలే తెలిపారు. దీనిపై శివసేన-బీజేపీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల సందర్బంగా బీజేపీ-శివసేన పొత్తు వైఫల్యం చెందడంపై మాట్లాడానికి నిరాకరించారు.
ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల మహారాష్ట్రలో 225 నుంచి 230 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజన మరోసారి పనిచేసిందని ఆయన తెలిపారు.