మంత్రి పదవికోసం ‘మరాఠా వంటకాలు’ | Marata recipes to be under control near local restaurants | Sakshi
Sakshi News home page

మంత్రి పదవికోసం ‘మరాఠా వంటకాలు’

Published Mon, Jun 1 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

మంత్రి పదవికోసం ‘మరాఠా వంటకాలు’

మంత్రి పదవికోసం ‘మరాఠా వంటకాలు’

మంత్రిపదవికోసం దీర్ఘకాలంగా ఆకాంక్షిస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, ఎంపీ రాందాస్ అథవాలే తాజాగా, మహారాష్ట్రలోని రెస్టారెంట్లలో స్థానిక ఆహార పదార్థాలనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక అస్తిత్వాన్ని రాజకీయాలకోసం ఉపయోగించుకునే సరికొత్త ప్రయత్నం ఇది.
 
 నిజాం ప్రభువు మనసుకు ఏదైనా ఆలోచన తట్టి దాన్ని తన దర్బారులో ప్రస్తావించిన ప్పుడు ఆయన అధికారులు ముక్తకంఠంతో ‘అవును, అవు ను’ అనేవారట. వాస్తవానికి దాని అర్థం ‘కాదుకాదు’ అనే. ‘అద్భుతం హుజూర్,  మీ వివేచన నుంచి మాత్రమే ఇలాంటివి పుట్టుకొస్తాయి. కాని వాటిని అమలు చేసేముందు కొన్ని అవరోధా లను పరిష్కరించాల్సి ఉంది. దయచేసి మాకు కాస్త సమయాన్ని ఇవ్వండి’ అనేవారట వారు. కాలం గడిచేకొద్దీ నిజాం తన ఆలోచనను పూర్తిగా మర్చి పోయేవాడు. అధికారులు నిట్టూర్పు విడిచేవారు.
 
 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, ఎంపీ రాం దాస్ అథవాలే విషయంలో కూడా ఇదే జరిగింది మరి. ఇతడు మహారాష్ట్రలో లేదా కేంద్రంలో మంత్రిపదవి కోసం దీర్ఘకాలంగా ఆకాంక్షిస్తున్నారు. ఇటీవలే  మహా రాష్ట్రలోని అన్ని రకాల, అన్ని తరగతుల రెస్టారెంట్లలో మహారాష్ట్ర ఆహార పదార్థాలనే తమ మెనూలో పొందు పర్చాలన్న కోరికను ఇతడు వెలిబుచ్చాడు. వేయించిన బియ్యం, ఉల్లిపాయలు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు కలిపి వండే స్థానిక ఖండా పోహె అనే వంటకాన్ని, చిన్న బ్రెడ్‌లో బోండాను దట్టించి తయారు చేసే శాండ్‌విచ్ వడాపావ్‌ను అన్ని రెస్టారెంట్లలో ఉంటాలని అతడి డిమాండ్.
 
 తన ప్రతిపాదనకు రెస్టారెంట్ల యజమానులు ఆమోదం తెలుపుతూనే మంచి మరాటీ వంటగాళ్లు దొరకటం లేదని వినయ పూర్వకంగానే రాందాస్‌కు విన్నవించారు. సరైన కుక్‌లను ఆయన వెతికిపెడితే, తమ వినియోగదా రులందరికీ మరాటీ వంటకాలనే వడ్డిస్తామని వారు సెలవిచ్చారు.రాందాస్ వంటి నేతకు లేదనే సమాధానం చెప్ప డానికి గాను మరాటీ దినపత్రిక పుధారి మాత్రమే ఈ ట్రిక్కును తన పాఠకులకు నివేదించింది. మరి రాందాస్ మామూలు వ్యక్తి కాదు. అవసరమైతే వీధు ల్లోకి సమస్యను తీసుకుపోగల కేడర్ బలం కలిగిన వాడు. హోటల్స్‌కు సంబంధించిన ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకుపోతామని రాందాస్ పార్టీ ప్రతిపాదించింది కూడా.
 మహారాష్ట్ర ప్రజలు తమ సాంస్కృతిక అస్తిత్వం, భాష విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. కేవలం సాంస్కృతిక అస్తిత్వం చుట్టూ వారు ఒక రాజకీ య పార్టీనే సృష్టించుకున్నారు. అదే శివసేన. ప్రస్తుతం శివసేనతో, బీజేపీతో పోటీ పడటానికి రాందాస్ సిద్ధమవుతున్నారు. అది పూర్తిగా అవకాశవాదమే అనుకోండి. విమర్శించడానికి అతడికి ఒక సమస్య కావాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గంలోకి రాందాస్‌ను తీసుకో లేదు. ఎంపీగా ఉన్నప్పటికీ అతడిని ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌లోకి ఆహ్వానించలేదు.
 
 మొత్తంమీద  చెప్పాలంటే మహారాష్ట్ర ప్రజలకు తిండి పట్ల గల మక్కువను ఉపయోగించుకోవడానికి రాందాస్ ఒక చెడు ప్రయత్నం చేశారు. మహా రాష్ట్రీయులు ఇంటి భోజనంపై మక్కువ చూపిస్తారు లేదా వీధుల్లో ఆహారాన్ని ఆరగిస్తారు. అది ప్రత్యేక మైనది కావచ్చు. స్నాక్ కావచ్చు లేదా భోజనమే కావచ్చు వంటగది సౌకర్యం లేనివారికి స్ట్రీట్ ఫుడ్ ఒకటే మార్గం. వీరిలో చాలామందికి తగిన ఇళ్లు కూడా ఉండవు. స్థానికులు అయినా కాకున్నా సరే వీళ్లంతా బయటి తిండిపైనే ఆధారపడి బతికేస్తుంటారు.
 
 అయితే ఈ ఆహారం రెస్టారెంట్ మెనూ వంటి గంభీరమైనది కాదు. ఉడిపి కావచ్చు లేదా శెట్టి నడిపే హోటల్ కావచ్చు. ఇవి ఇడ్లీ, దోసె, ఊతప్పం వంటి దక్షిణాది వంటలను ఇవి అందిస్తుంటాయి. ఇక పంజాబీ వంటకాలు ఎలా ఉంటాయంటే పంజా బీయులే వాటిని గుర్తించలేరు. చైనీస్, కాంటినెంటల్ వంటకాలను వారికి వడ్డించకపోవడానికి తగిన కారణ మేదీ కనిపించదు. మీరు వెతుక్కోగలిగితే అవన్నీ వీధి వ్యాపారుల వద్ద కూడా దొరుకుతాయి.
 మీరు ఆరోగ్యం పట్ల మక్కువ కలిగి ఉండి రెస్టారెంట్ కిచెన్లు, సర్వీస్ బాగుంటుందని భావించి వీధుల్లో వంటకాలకు దూరం జరిగినట్లయితే, ప్రతి రెస్టారెంట్‌లోనూ రాందాస్ ప్రతిపాదించినట్లు అక్కడ కూడా మహారాష్ట్ర వంటమనిషి కోసం మీరు కాస్త వేచి ఉండాల్సి వస్తుంది. ఇలా ఎంత కాలం? అంటే ఎవరికి తెలుసు.
 
 ఈసారి రెస్టారెంట్‌లో అడుగు పెట్టినప్పుడు ఈ సౌకర్యంకోసం మీరు అడగొద్దు. దానికి బదులుగా, ఆయన బ్యూరో ఏమయినా మహారాష్ట్ర కుక్‌లచేత పని ప్రారంభించ చేసిందా అని అథవాలేనే అడగండి. అథవాలే నొక్కిచెబుతున్నట్లుగా మీడియా మహా రాష్ట్ర వంటల గురించి నివేదిస్తున్నటప్పుడు ఆ వంట కాలలో వారన్-బాత్, పప్పుకూర, మసాలా బాత్, రసం, వంకాయబజ్జీ వంటివి ఉంటాయని మీడియా మనకు సూచించకపోవచ్చు. ఒకవేళ ఇవన్నీ మెనూలో ఉంటే, ఉడిపి, షెట్టి, చైనీస్ హోటళ్లు కూడా మరాటీ రెస్టారెంట్లుగా మారిపోతాయి. ఇది మితిమీరిన ఏకత్వం కావచ్చు కూడా.
 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్: mvijapurkar@gmail.com)
 - మహేష్ విజాపుర్కార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement