సాక్షి, విజయవాడ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడం శుభపరిణామమని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఏపీలో కొందరు వ్యతిరేకిస్తున్నారని, అంబేద్కర్ అందరివాడని, ఆయన్ను గౌరవించాలని కోరుతున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించొద్దని సూచించారు. అలాగే ఏపీలో 3,35,358 మందికి పోస్ట్ మెట్రిక్, 2,13,694 మంది విద్యార్ధులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ఇస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వాన్ని రామ్‌దాస్ అథవాలే కోరారు.
చదవండి: పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దు: మంత్రి అంబటి
Comments
Please login to add a commentAdd a comment