
5:03 PM
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము
అనేక వారసత్వ కట్టడాలకు ఏపీ నిలయం: ద్రౌపది ముర్ము
ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది: ద్రౌపది ముర్ము
ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు: ద్రౌపది ముర్ము
4:57 PM
ముర్ముకే సంపూర్ణ మద్దతు: సీఎం జగన్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలుపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్. ఈ మేరకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు.
‘రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించింది. వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉంది. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది. మనమంతా ముర్ముకే ఓటేసి గెలిపించుకోవాలి. ఏ ఒక్క ఓటు వృథా కాకుండా చూసుకోవాలి’ అని సీఎం జగన్ అన్నారు.
4:33 PM
మంగళగిరి సీకే కన్వెన్షన్‌కు చేరుకున్న ముర్ము, సీఎం జగన్
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం
4:00 PM
సీఎం వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సీఎం వైఎస్ జగన్‌తో మర్యాద పూర్వక భేటీ
సీఎం నివాసం నుంచి సీకే కన్వెన్షన్‌కి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డి
3:10 PM
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ స్వాగతం పలికారు.
ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు ఘన స్వాగతం అందించారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుండి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో విజయవాడుకు బయలుదేరారు. ఇక, ఆమె వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ కానున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇది కూడా చదవండి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన రద్దు
Comments
Please login to add a commentAdd a comment