సాక్షి, హైదరాబాద్: వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ అచీవర్స్ కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీను టెక్నాలజీ కంపెనీకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ ఎక్స్‌లెన్స్ అవార్డ్ దక్కింది.
కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేతుల మీదుగా శ్రీను టెక్నాలజీ ఎండీ చిల్కా కావ్యశ్రీ అందుకున్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో ఉన్న వనరులను వినియోగించుకొని వ్యాపార రంగాల్లో మహిళలు జైత్రయాత్ర సాగించడం మంచి పరిణామమన్నారు. ఈ సందర్భంగా యువ దళిత మహిళ కావ్యశ్రీని అభినందించారు. భవిష్యత్‌లో మరింత ఎదగాలని ఆకాక్షించారు. సదస్సులో కేంద్ర మాజీ మంత్రి కె.జె ఆల్‌ఫాన్స్, సిక్కిం మాజీ గవర్నర్ బి.సి.సింగ్, మాజీ ఎంపి జె.కె.జెయిన్, సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది జి.వి.రావు తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment