ముంబై: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామ్‌దాస్ అతవాలే కంగనా రనౌత్‌కు మద్దతుగా నిలిచారు. ముంబాయి నగరం పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను తలపిస్తుందంటూ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి రామ్‌దాస్ మాట్లాడుతూ, ‘నాకు పూర్తిగా నిజమేమిటో తెలియదు, కానీ శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ నటిని ఉద్దేశించి అలా మాట్లాడటం మాత్రం ఖండించదగ్గ విషయం. కంగనా చేస్తున్న పోరాటంలో మేం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తాం’ అని పేర్కొన్నారు.
శివసేన మహిళ విభాగం నేతలు కంగనారనౌత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి ఆమె పోస్టర్‌లపై చెప్పులతో దాడి చేశారు. దీనిపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్రఫడ్నవీస్ భార్య అమృత స్పందిస్తూ ‘ మేం ముంబాయి గురించి అలా అనడాన్ని సమర్థించం. కానీ ప్రతి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. నటి పోస్టర్‌లపై చెప్పులతో దాడిచేయడం అనే చర్యలు హేయమైనవి’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మహారాష్ట్ర పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా మారిందని కామెంట్ చేసిన కంనా ఆ తరువాత ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని తాలిబన్లతో పోల్చింది. దీనిపై మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ స్పందిస్తూ కంగనాకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. అంత అభద్రతా భావం ఉంటే మహారాష్ట్రని వదిలి వెళ్లిపోవాలి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న పోలీసుల గురించి తప్పుగా ఎలా మాట్లాడుతుంది’ అని మండిపడ్డారు.
కంగనాకు మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి
Published Sat, Sep 5 2020 10:27 AM | Last Updated on Sat, Sep 5 2020 10:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment