కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పఠాన్ కోట్ దాడి.. ఎన్ఐఏ విచారణల నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో పఠాన్ కోట్ దాడి, ఎన్ఐఏ విచారణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
మరో వైపు.. పఠాన్ కోట్ దాడికి బాధ్యులుగా భావిస్తున్న మోస్ట్ వాండెట్ ఉగ్రవాది, జైషే మహ మ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను కస్టడీలోకి మాత్రమే తీసుకున్నామని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన మంత్రి తెలిపారు. పఠాన్ కోట్ దాడి వెనక మసూద్ హస్తం ఉందని తేలితేనే.. అతడిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.