Maulana Masood Azhar
-
రహస్యంగా మసూద్ విడుదల
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల అనంతరం వాటికి బా«ధ్యత వహించిన జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ సహా ఎందరినో అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించిన పాక్ ఇప్పుడు తన దారి మార్చుకుంది. అజర్‌ని మూడో కంటికి తెలీకుండా రహస్యంగా జైలు నుంచి విడుదల చేసింది. అజర్ ప్రస్తుతం పాక్ జైల్లో లేడని, భవల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్టుగా భారత్ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. కశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించడానికి, భారత్‌లో భారీగా దాడులకు పాక్ కుట్ర పన్నుతున్నట్టు భద్రతా అధికారులు వెల్లడించారు. కశ్మీర్లోకి చొరబడడం, ఈ ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించడం, కశ్మీర్లో ఘర్షణలు రేగేలా ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేయడం వంటి వాటి కోసం పాక్ అజర్‌ను విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. జైషేప్రధాన కార్యాలయంలో అజర్, ఆయన సోదరులు, సంస్థకి చెందిన ఇతర సభ్యులు దాడులకు వ్యూహాలను రచిస్తున్నట్టు భారత్‌కు ఉప్పందింది. అజర్‌ను ఇటీవల భారత్ ఉగ్రవాది ప్రకటించిన విషయం తెలిసిందే. -
నం.1 శత్రువు భారత్.. నం.2 మోదీ!!
ఇస్లామాబాద్ : భారతదేశం 69వ గణతంత్ర వేడుకల్లో మునిగిపోయినవేళ.. పాకిస్తాన్ గడ్డపై నుంచి వెలువడిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. చైనా అండతో నిర్బంధం నుంచి తప్పించుకు తిరుగుతున్న మౌలానా మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ ఏ మొహమ్మద్.. ఇండియాను ప్రప్రధమ శత్రువుగా ప్రకటించింది. సింధ్ రాష్ట్రంలోని లర్కానాలో జరిగిన బహిరంగ సభలో అజార్ సోదరుడు, జేషే కీలక నేత మౌలానా తల్హా సైఫ్ ఈ విషయాలను వెల్లడించాడు. ‘హిందుస్తాన్‌పై జిహాద్‌కు ముందుకురావాల’ని యువతను రెచ్చగొట్టాడు. ఒకవైపు తనను తాను ఉగ్రబాధిత దేశంగా చెప్పుకునే పాక్.. ఇలా బాహాటంగా జిహాద్‌కు పిలుపునిస్తున్న నేతలను మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తుండటం గమనార్హం. కశ్మీరీలు పిలుస్తున్నారు : ‘‘మనకు నంబర్ 1 శత్రువు ఇండియా, నంబర్ 2 మోదీ. అల్ ఖలామ్(అజార్ నేతృత్వంలో నడిచే పత్రిక) ద్వారా ఈ సందేశాన్ని అందరికీ చేరవేయండి. భారత్‌లోని మనవాళ్లు అల్ ఖలామ్ వెబ్సైట్ ద్వారా విషయాలను తెలుసుకోవచ్చు. ఉపఖండంలో మినీ సూపర్ పవర్‌గా వ్యవహరిస్తోన్న భారత్.. మొదటి నుంచీ పాకిస్తాన్‌కు అడ్డంకులు సృష్టిస్తూనేఉంది. కానీ కశ్మీర్లో మాత్రం భారత సైన్యం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కశ్మీరీ తల్లులు, సోదరీమణులు సాయం కోసం మనల్ని(పాకిస్తానీలను) పిలిచారు. కానీ మనం మాత్రం బానిసలుగా ఉండిపోయాం. కానీ ఇప్పుడు.. ముజాహిద్దీన్లు సరిహద్దు దాటి చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఇండియాపై జిహాద్ చెయ్యడానికి ధైర్యవంతులైన యువకులు మరింత మంది ముందుకురావాలి’’ అని మౌలానా సైఫ్ వ్యాఖ్యానించాడు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో జైషే మొహమ్మద్ సంస్థ ప్రమేయం తెలిసిందే. ఆ సంస్థ వ్యవస్థాపకుడైన మసూద్ అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించి, నిర్బంధించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ పోరాడింది. కానీ తీర్మానం జరిగిన ప్రతిసారి వీటో చేసిన చైనా అజార్‌ను కాపాడుకుంది. ఇప్పుడు టార్గెట్ ఇండియా, మోడీలేనని సాక్షాత్తు అజార్ సోదరుడే ప్రకటించడంపై దేశాల స్పందిన వెలువడాల్సిఉంది. బహిరంగ సభలో మాట్లాడుతున్న మౌలానా తల్హా సైఫ్ -
మసూద్ సోదరుడి కొడుకు హతం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు సోదరుడి కొడుకు తల్లా రషీద్ కశ్మీర్లో ఎన్కౌంటర్లో హతమయ్యాడు. 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లడం తెలిసిందే. ఈ హైజాక్ కుట్రకు సూత్రధారిగా వ్యవహరించిన అబ్దుల్ రౌఫ్ కొడుకే తల్లా రషీద్. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఎన్కౌంటర్లో తల్లా రషీద్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అమెరికా తయారు చేసిన, పాకిస్తానీ ప్రత్యేక దళాలు ఉపయోగించే ఎం4 రైఫిల్, రెండు ఏకే–47 తుపాకులను ఎన్కౌంటర్ స్థలం నుంచి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఆర్మీకి చెందిన ఓ సైనికుడు కూడా మరణించాడు. హతమైన ముగ్గురు ఉగ్రవాదులను మహ్మూద్ భాయ్ (దక్షిణ కశ్మీర్లో జైషే కమాండర్), వసీం అహ్మద్, తల్లా రషీద్‌గా గుర్తించామని అధికారులు చెప్పారు. వీరిలో మహ్మూద్ భాయ్, తల్లా రషీద్‌లు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు. మసూద్ అజర్ సోదరుడి కొడుకు తల్లా రషీద్ ఎన్కౌంటర్లో మరణించాడంటూ జైషే అధికార ప్రతినిధి స్థానిక వార్తా సంస్థలకు ప్రకటనలు పంపాడు. రషీద్‌ను తమ వాడిగా చెప్పుకున్నందుకు జైషేకు ధన్యవాదాలు తెలియజేసిన ఐజీ మునీర్ ఖాన్...ఉగ్రవాదుల మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా పాకిస్తాన్‌కు సందేశం పంపుతామని చెప్పారు. ఎం4 రైఫిళ్లను పాకిస్తాన్ ప్రత్యేక బలగాలు ఉపయోగిస్తాయనీ, వారే వీటిని జైషే ఉగ్రవాదులకు ఇచ్చి ఉంటారని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు. రూ.36.5 కోట్ల పాత నోట్ల జప్తు ఉగ్రవాదులకు నిధుల చేరవేత కేసుకు సంబంధించి జరుపుతున్న విచారణలో భాగంగా రూ.36.5 కోట్ల విలువైన పాత రూ.500, రూ.వెయ్యి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు దగ్గర్లోని ఓ ప్రదేశంలో సోమవారం ఈ నోట్లు దొరికినట్లు అధికారులు చెప్పారు. -
చైనాను కార్నర్ చేయనున్న భారత్!
న్యూఢిల్లీ: చైనాను భారత్ కార్నర్ చేయనుంది. పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టినట్లుగానే చైనాను ఇక తప్పుబట్టనుంది. చైనా తాను చేసిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోకపోతే నిజంగానే ఇక చైనాతో సత్సంబంధాల విషయంలో భారత్ దూరం జరగనుంది. జైషే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థ అని, దానిపై నిషేధం విధించి, దాని చీఫ్ మౌలానా మసూద్ అజర్‌ను దోషిగా నిలబెట్టాలని భారత్ ఈ ఏడాది (2016) మార్చి 31న ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టింది. అయితే, ఐదుగురు శాశ్వత సభ్యులు, పదిమంది తాత్కాలిక సభ్యులు ఉన్న ఈ మండలిలో ఒక్క చైనా మాత్రమే భారత్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత్ తాజాగా పఠాన్ కోట్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ జరిపిన విచారణలో జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన వారే ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు గుర్తించింది. పలు ఆధారాలు సేకరించింది. ఇప్పుడు వాటిని మరోసారి భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా ఈసారి కచ్చితంగా భారత్ గతంలో చేసిన ప్రతిపాదనను ఆమోదించి తీరాలి. అలా కాకుండా విబేధిస్తే ఇక చైనాను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టాలని భారత్ వ్యూహం. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు ముందునుంచే చైనా మద్దతిస్తోందని ఇప్పటికే పలు సందర్భాల్లో బయటపడిన విషయం తెలిసిందే. -
మసూద్ అజర్‌పై చార్జిషీట్
పఠాన్ కోట్ చార్జిషీట్లో జైషే చీఫ్ పేరు చేర్చిన ఎన్ఐఏ న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి కేసుకు సంబంధించి సోమవారం ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమూద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ పేరును చేర్చింది. పఠాన్‌కోట్ దాడికి మసూద్ అజర్ సూత్రధారి అని వెల్లడించింది. అజర్‌తో పాటు అతని సోదరుడు మరో ఇద్దరి పేర్లను సైతం చార్జిషీట్లో పేర్కొంది. పేలుడు పదార్థాలు, ఆయుధాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు సోమవారం పంచకులలోని ఎన్ఐఏ కోర్టులో నలుగురిపై చార్జిషీట్ దాఖలు చేసింది. సాక్ష్యాధారాల సేకరణ, దర్యాప్తులో సహకరించిన.. జైల్లోని ఒక పాక్ ఉగ్రవాది, అమెరికా ఎఫ్‌బీఐ, న్యాయ శాఖ అధికారులు సహా ఆరుగురిని సాక్షులుగా పేర్కొంది. ఈ ఏడాది జనవరి 2న పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికులు అమరులయ్యారు. మసూద్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మరో ఇద్దరు షాహీద్ లతీఫ్, కషీఫ్ జాన్ దాడులకు సహకరించినట్టు ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. కాగా, మసూద్ అజర్‌పై చార్జిషీట్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం అతనిపై ఆంక్షలు విధించేందుకు భారత్ ఉపయోగించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. -
'ప్రపంచం త్వరలోనే వింతలను చూస్తుంది'
'అన్ని వైపుల నుంచి తీవ్ర మైన ఒత్తిడి ఎదురైతే ఎవరైనా ఏం చేస్తారు? ముస్లింలు కూడా అదే చెయ్యబోతున్నారు. ప్రపంచం త్వరలోనే కొన్ని వింతలను చూడబోతోంది..' అంటూ రాతపూర్వక బెదిరింపులకు దిగాడు జైష్ ఏ మహమ్మద్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్. జైషే అధికారిక ఆన్ లైన పత్రిక 'అల్ ఖలామ్'లో జూన్ 3న రాసిన వ్యాసంలో భారత్ పైనా తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. కందహార్ విమానం హైజాగ్ ఘటన తర్వాత తనను పట్టుకునేందుకు భారత్ తాలిబన్లకు భారీగా డబ్బును ఎరచూపిందని, దివంగత తాలిబన్ చీఫ్ ముల్లా అఖ్తరే తనకీ విషయం చెప్పాడని అజార్ పేర్కొన్నాడు. 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు తమ నాయకుడు మసూద్ అజార్ తోపాటు మరో ఇద్దరు కీలక నేతలు ముస్తాక్ అహ్మద, ఒమర్ సయూద్ లను విడిపించుకుపోయిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో కేంద్ర విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ స్వయంగా అజార్ ను తోడ్కొని వెళ్లి కందహార్ లో వదిలేశారు. ఓ వైపు ప్రయాణికుల బట్వాడ జరుగుతుండగానే, అజార్ ను తిరిగి పట్టించాలని కందహార్ ఎయిర్ పోర్టులోని వీఐపీ గెస్ట్ హౌస్ జశ్వంత్ సింగ్.. నాటి తాలిబన్ విమానయాన మంత్రి ముల్లా అఖ్తర్ తో బేరసారాలాడరని అజార్ రాసుకొచ్చాడు. 'హైజాక్ ఉదంతం ముగిసిన కొన్నేళ్లకి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరాచీ నుంచి కందహార్ వెళ్లాం. విమానయాన మంత్రిగా ముల్లా అఖ్తర్ అక్కడ మాకు ఘనస్వాగతం పలికారు. వీఐపీ గెస్ట్ హౌస్ లోని ఓ సోఫాలో తన పక్కనే కూర్చొబెట్టుకున్నారు. ఆయన నాతో.. 'సరిగ్గా నువ్వు కూర్చున్న చోటే భారత మంత్రి జశ్వంత్ కూర్చుని, నిన్ను పట్టివ్వమని, అందుకోసం ఎంత డబ్బైనా ఇస్తామని అడిగారు' అని చెప్పారు. ఇప్పుడు తాలిబన్ ప్రభుత్వం లేదు. ముల్లా కూడా గత నెలలో చనిపోయారు. తాలిబన్లను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఖతం చేశారు. ఇందులో అమెరికా తర్వాత ఇరాన్ దే ప్రముఖ పాత్ర. తమపై కొనసాగుతున్న దమనకాండను ఎదుర్కొనేందుకు ముస్లింలు ఒకతాటిపైకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. ప్రపంచం త్వరలోనే వింతలను చూస్తుంది' అని మసూద్ అజార్ తన వ్యాసంలో రాశాడు. అయితే అజార్ ఆరోపణలకు రా అధికారులు తిప్పికొట్టారు. కందహార్ హైజాక్ వ్యవహారంలో డబ్బుల ప్రస్తావన లేనేలేదని రా మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ స్పష్టం చేశారు. 'నాడు కందహార్ లో జశ్వంత్ సింగ్.. తాలిబన్ విదేశాంగ మంత్రి ముత్తా వకీల్ తో మాత్రమే మాట్లాడారు. అజార్ చెబుతున్నట్లు ముల్లా అఖ్తర్ ను కలుసుకోలేదు. దీనికి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు సమాధానం చెప్పాలి. అందులో కరైన ముల్లా అఖ్తర్ చనిపోయాడు. రెండో వ్యక్తి జశ్వత్ సిన్హా ప్రస్తుతం కోమాలో ఉన్నారు. కాబట్టి ఆ ఆరోపణల్లో నిజం నిగ్గుతేలే అవకాశమేలేదు' అని మరో రా అధికారి ఆనంద్ అర్నీ చెప్పారు. -
మసూద్ అజర్ అరెస్ట్ అబద్ధమా?
అవునంటున్న పాక్ అధికార వర్గాలు ‘పఠాన్‌కోట్’ దర్యాప్తు వివరాలనూ వెల్లడించని పాక్ న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి సూత్రధారిగా వ్యవహరించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్ అరెస్ట్ విషయంలో పాకిస్తాన్ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. మసూద్ అజర్‌ను అరెస్ట్ చేయలేదని, ఆయన భద్రత నిమిత్తమే గృహ నిర్బంధంలో ఉంచామని ఇప్పటికే పంజాబ్ న్యాయశాఖ మంత్రి స్పష్టం చేయగా.. పఠాన్‌కోట్ దాడి దర్యాప్తులో భాగంగా అజర్‌ను అరెస్ట్ చేశారంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సంబంధిత అధికారులు తాజాగా కుండబద్దలు కొట్టారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం కట్టుకథేనని నిఘా వర్గాల సమాచారం అధారంగా తేల్చిచెప్పారు. దాడి విషయంలో జైషేపైగానీ, ఆ సంస్థకు సంబంధించిన వారిపైగానీ కేసులు పెట్టినట్లుగా పాక్ ఇంతవరకు భారత్‌కు చెప్పలేదు. జైషే సంస్థకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు మాత్రమే పాక్ పేర్కొంది. మరోవైపు, పఠాన్‌కోట్ దాడిపై పాక్ అట్టహాసంగా ప్రారంభించిన దర్యాప్తు వివరాలను పాక్ వెల్లడించడం లేదు. గురుదాస్‌పూర్ ఎస్పీకి లై-డిటెక్టర్ పరీక్ష పఠాన్‌కోట్ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌పై లై-డిటెక్టర్ పరీక్ష జరిపేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ప్రత్యేక కోర్టు సోమవారం అనుమతించింది. మూడు రోజుల్లోగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ పరీక్షకు సల్వీందర్ కూడా అంగీకరించారని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. బీఎస్ఎఫ్ అధికారులపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ పంజాబ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు బీఎస్ఎఫ్ అధికారుపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడికి సంబంధించి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు సరిహద్దుల వెంబడి దేశంలోకి ప్రవేశించేందుకు ఏమైనా లోపాలు సాయపడ్డాయా అనే అంశాన్ని తేల్చేందుకు ఈ కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు చెప్పారు. -
జైషే చీఫ్ అరెస్టుపై నోరు విప్పిన పాక్
-
రాజ్ నాథ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పఠాన్ కోట్ దాడి.. ఎన్ఐఏ విచారణల నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో పఠాన్ కోట్ దాడి, ఎన్ఐఏ విచారణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరో వైపు.. పఠాన్ కోట్ దాడికి బాధ్యులుగా భావిస్తున్న మోస్ట్ వాండెట్ ఉగ్రవాది, జైషే మహ మ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను కస్టడీలోకి మాత్రమే తీసుకున్నామని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన మంత్రి తెలిపారు. పఠాన్ కోట్ దాడి వెనక మసూద్ హస్తం ఉందని తేలితేనే.. అతడిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. -
జైషే చీఫ్ అరెస్టుపై నోరు విప్పిన పాక్
లాహోర్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఉగ్రదాడుల నిందితులు, జైషే గ్రూపు ఉగ్రసంస్థ సభ్యులపై తీసుకుంటున్న చర్యలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు నోరువిప్పింది. ఉగ్రదాడుల సూత్రధారి, జైషే సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ గృహ నిర్బంధ కస్టడీలో ఉన్నట్లు పాక్ పేర్కొంది. కానీ, అతడిని అరెస్టు చేయలేదని న్యాయశాఖ మంత్రి రానా సనాఉల్లా తెలిపారు. మసూద్‌ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లుగా గురువారం కథనాలు వచ్చాయి. వాటిపై పాక్ వివరణ ఇచ్చుకుంది. పఠాన్‌కోట్ ఘటనకు బాధ్యులెవన్నది తెలియకుండా మసూద్‌ను ఎలా అరెస్టు చేస్తామని సనావుల్లా ప్రశ్నించారు. ఈ ఘటనపై పాక్ దర్యాప్తు చేపట్టిందని, సాక్ష్యాధారాల కోసం ప్రయత్నాలు చేపట్టిందన్నారు. మరోవైపు భారత్ వాదన ప్రకారం.. ఈ ఏడాది జనవరి 2న ఎయిర్ బేస్ క్యాంపులో జరిగిన కాల్పుల ఘటనకు మసూద్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తోంది. మసూద్ అరెస్ట్ వార్త స్వాగతించదగినది... పాక్ తీసుకున్న తొలి చర్యకు సంతోషమే, కానీ అతడి అరెస్ట్ వార్తను అధికారికంగా పేర్కొనకపోవడంపై విదేశాంగశాఖ మంత్రి వికాస్ స్వరూప్ గురువారం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి మసూద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. -
మసూద్, అతడి సోదరుడు సూత్రధారులు!
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ జైష్-ఈ-అహ్మద్ హస్తం ముందని గుర్తించినట్టు తెలుస్తోంది. జైష్-ఈ-అహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్, అతడి సోదరుడు, మరో ఇద్దరు దాడికి సూత్రధారులుగా గుర్తించామని పాకిస్థాన్ కు భారత్ తెలిపినట్టు సమాచారం. పఠాన్ కోట్ దాడి వెనుకున్న కుట్రదారులను చట్టపరంగా శిక్షించేందుకు పాకిస్థాన్ వెంటనే చర్యలు చేపట్టాలని పాకిస్థాన్ భారత్ కోరుతోంది. ఈనెల 15న ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. మరోవైపు దర్యాప్తులో సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి హామీయిచ్చిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.