లాహోర్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఉగ్రదాడుల నిందితులు, జైషే గ్రూపు ఉగ్రసంస్థ సభ్యులపై తీసుకుంటున్న చర్యలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు నోరువిప్పింది. ఉగ్రదాడుల సూత్రధారి, జైషే సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ గృహ నిర్బంధ కస్టడీలో ఉన్నట్లు పాక్ పేర్కొంది. కానీ, అతడిని అరెస్టు చేయలేదని న్యాయశాఖ మంత్రి రానా సనాఉల్లా తెలిపారు. మసూద్ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లుగా గురువారం కథనాలు వచ్చాయి. వాటిపై పాక్ వివరణ ఇచ్చుకుంది. పఠాన్‌కోట్ ఘటనకు బాధ్యులెవన్నది తెలియకుండా మసూద్ను ఎలా అరెస్టు చేస్తామని సనావుల్లా ప్రశ్నించారు. ఈ ఘటనపై పాక్ దర్యాప్తు చేపట్టిందని, సాక్ష్యాధారాల కోసం ప్రయత్నాలు చేపట్టిందన్నారు.
మరోవైపు భారత్ వాదన ప్రకారం.. ఈ ఏడాది జనవరి 2న ఎయిర్ బేస్ క్యాంపులో జరిగిన కాల్పుల ఘటనకు మసూద్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తోంది. మసూద్ అరెస్ట్ వార్త స్వాగతించదగినది... పాక్ తీసుకున్న తొలి చర్యకు సంతోషమే, కానీ అతడి అరెస్ట్ వార్తను అధికారికంగా పేర్కొనకపోవడంపై విదేశాంగశాఖ మంత్రి వికాస్ స్వరూప్ గురువారం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి మసూద్ వివరాలను మీడియాకు వెల్లడించారు.
జైషే చీఫ్ అరెస్టుపై నోరు విప్పిన పాక్
Published Fri, Jan 15 2016 11:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:44 PM
Advertisement