'చర్చలు ఓకేగానీ.. స్ట్రాంగ్ మెస్సేజ్ ఇవ్వాల్సిందే'
న్యూఢిల్లీ: పాకిస్థాన్తో దౌత్య సంబంధాల విషయంలో ముందుకు వెళ్లొచ్చని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ఎన్డీయేకు సందేశాన్నిచ్చినట్లు సమాచారం. అయితే, ఉగ్రవాదం విషయంలో మాత్రం పాకిస్థాన్కు గట్టి సందేశాన్ని మాత్రం ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
'పాకిస్థాన్తో చర్చలు జరపవచ్చు. కానీ, గట్టి సందేశం మాత్రం ఆ దేశానికి ఇవ్వాలి. పఠాన్ కోట్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఈ అంశాన్ని రేపు జరగబోయే ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశంలో ప్రధాన అంశంగా పెట్టాలి. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ధృఢమైన నిర్ణయం తీసుకోవాలని ఆ దేశానికి నొక్కి చెప్పాలి' అని ఎన్డీయేకు సూచించినట్లు కీలక వర్గాల సమాచారం. అంతేకాకుండా భారత్ లో పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ప్రత్యేక చర్చలు జరిపేందుకు త్వరలోనే ఆరెస్సెస్ ముఖ్యనేతలంతా భేటీ కానున్నట్లు సమాచారం. అంతకు అసలు చర్చలే జరపకూడదని, భారత్ భద్రతే ముఖ్యమని ఆరెస్సెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.