న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ జైష్-ఈ-అహ్మద్ హస్తం ముందని గుర్తించినట్టు తెలుస్తోంది. జైష్-ఈ-అహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్, అతడి సోదరుడు, మరో ఇద్దరు దాడికి సూత్రధారులుగా గుర్తించామని పాకిస్థాన్ కు భారత్ తెలిపినట్టు సమాచారం.
పఠాన్ కోట్ దాడి వెనుకున్న కుట్రదారులను చట్టపరంగా శిక్షించేందుకు పాకిస్థాన్ వెంటనే చర్యలు చేపట్టాలని పాకిస్థాన్ భారత్ కోరుతోంది. ఈనెల 15న ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. మరోవైపు దర్యాప్తులో సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి హామీయిచ్చిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
మసూద్, అతడి సోదరుడు సూత్రధారులు!
Published Thu, Jan 7 2016 7:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement
Advertisement