
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్‌ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘జమ్మూకశ్మీర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు దిగుతున్న జైషే మహ్మద్‌కు ఇది మారుపేరు.
ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి హింసాత్మక చర్యలకు కుట్ర పన్నుతోంది. యువతను ఉగ్ర భావజాలం వైపు ఆకర్షిస్తోంది’’ అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం పీఏఎఫ్‌ఎఫ్‌పై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది.