న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పీపుల్స్ ఫ్రీడం లీగ్(జేకేపీఎఫ్‌ఎల్)తోపాటు వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్‌తో సంబంధమున్న జమ్మూకశ్మీర్ పీపుల్స్ లీగ్(జేకేపీఎల్)లోని అన్ని గ్రూపులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఉపా) కింద కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధం విధించింది.
దీంతోపాటు, ఉగ్రవాద ఆరోపణలపై జైలులో ఉన్న యాసిన్ మాలిక్ సారథ్యంలోని జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్‌ఎఫ్)పై నిషేధాన్ని మరో అయిదేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడటానికి కొద్ది గంటల ముందు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఉగ్ర సంస్థలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment