
భారత్ అతిగా స్పందిస్తుంది: ముషారఫ్
పాకిస్థాన్ : భారత్లోని పఠాన్కోట్ ఘటనపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మంగళవారం స్పందించారు. ఈ ఘటనపై భారత్ అతిగా స్పందిస్తుందని ముషారఫ్ ఆరోపించారు. పాక్ - భారత్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే అని ఆయన చెప్పారు. పఠాన్కోట్లాంటి ఘటనలు సాధారణం అని ఆయన వ్యాఖ్యానించారు. పాక్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పర్యటనకు అంత ప్రాధాన్యత లేదని ముషారఫ్ పేర్కొన్నారు.