న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడిలో అనుమానితుడిగా పేర్కొన్న పంజాబ్ సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి సల్వీందర్ సింగ్‌కు జాతీయ నేర పరిశోధనా సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది. సింగ్‌కు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించిన ఎన్‌ఐఏ... ఈ దాడితో ఆయనకు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొంది. గత పదిహేను రోజులుగా తమ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ర్యాంక్ అధికారి అయిన సింగ్‌ను ప్రశ్నించిన ఎన్‌ఐఏ, లైడిటెక్టర్ వంటి శాస్త్రీయ పరీక్షలు సైతం చేసింది. వీటితోపాటు అమృత్‌సర్‌లోని ఆయన నివాసం, కార్యాలయం, సంబంధిత ప్రాంతాల్లో శోధించినా ఎలాంటి ఆధారాలూ దొరకలేదని ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి.