
పఠాన్ కోట్ కు పారికర్
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఐఏ దళపతులతో కలిసి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించనున్నారు.
న్యూఢిల్లీ: ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఐఏ దళపతులతో కలిసి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను మంగళవారం సాయంత్రం సందర్శించనున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను సైనిక బలగాలు హతమార్చాయి.
ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా, జాతీయ దర్యాప్తు సంస్థ అధిపతి శరద్ కుమార్ తో కలిసి పారికర్.. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ ను సందర్శించనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. కాగా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఐదుగురు ఉగ్రవాదులు హతమయినట్టు ఎన్ఎస్ జీ ధ్రువీకరించింది. ఆరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది.