అఫ్గాన్‌కు పరారైన పఠాన్‌కోట్ కుట్రదారుడు
లాహోర్: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) కీలక నాయకుడు, పంజాబ్ పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన వారికి ఫోన్‌లో సూచనలు ఇచ్చిన కుట్రదారుడు పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు పరారయ్యాడు. ఈ ఏడాది జనవరి రెండున ఎయిర్‌బేస్‌పై దాడికి ముందు ఇతడు వారితో 18 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పాకిస్తాన్ అధికారులు గుర్తించారు.
ఆ సమయంలో ఈ ఉగ్రవాది పాక్ సరిహద్దులోని గిరిజన ప్రాంతంలో మకాం వేశాడు. పాక్ అధికారులు అక్కడికి వెళ్లేలోపే ఇతడు సరిహద్దు దాటి అఫ్గాన్‌లోకి ప్రవేశించాడని ప్రకటించిన పోలీసులు, నిందితుడి పేరు వెల్లడించడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్‌కు దాడికి పథకం పన్నిన వ్యక్తి తమ సంస్థను వదిలిపెట్టాడని జేఈఎం అధిపతి మసూద్ అజర్ ప్రకటించాడు.