flees
-
ఓరి.. దుర్మార్గుడా..! చలానాకు భయపడి..
Viral Video: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత హితభోద చేసినా.. వాహనదారులు పెడచెవిన పెడుతుంటారు. తమ జీవితాలతో పాటు తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతుంటారు. ప్రయాణించే ముందే హెల్మెట్, సరైన ద్రువపత్రాలు వెంట తెచ్చుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అవేవీ లేకుండా రోడ్లపై వాహనాలను నడుపుతూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. చలానా తప్పించుకోవడానికి ఓ యువకుడు చేసిన పని తన లవర్ కిందపడిపోయేలా చేసింది. ఓ యువకుడు తన ప్రేమికురాలితో బండిపై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. యువకుడు బండిని నెమ్మదిగా స్లో చేశాడు. అంతలోనే అక్కడికి ఓ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే యువకుడు చాలానా వేస్తాడేమోననే భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా బండి స్పీడ్ పెంచేసి సిగ్నల్‌ను దాటేయబోయాడు. అంతే వెనక ఉన్న యువతి అమాంతం కిందపడిపోయింది. ఆమెను పట్టించుకోకుండానే ఆ యువకుడు తప్పించుకున్నాడు. लड़की को breakup में देर नहीं करनी चाहिए ऐसे बहुत आयेंगे जाएँगे यह लड़का गर्लफ़्रेंड के लिये एक चालान नहीं भर सका बीच सड़क बाइक से उतार दिया pic.twitter.com/BkUdzNq4Ls — Abhishek Anand Journalist 🇮🇳 (@TweetAbhishekA) August 14, 2023 అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ అమ్మాయిని పైకి లేపి ఆస్పత్రికి తరలించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ ఆనంద్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రాఫిక్‌లో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదని సూచనలు చేశారు. ఓరి దుర్మార్గుడా..! లవర్ కంటే చలానానే ఎక్కువై పోయిందా అంటూ ఫన్నీగా మరికొందరు కామెంట్ పెట్టారు. ఇదీ చదవండి: Indian Laws: ఆ వెసలుబాటు పురుషులకు లేదు.. అమ్మాయిల్ని దత్తత తీసుకోలేరు -
271 కోట్లతో పారిపోయిన ప్రధాని భార్య!
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఈఏ) ప్రధానమంత్రి, అపర కుబేరుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ ఆల్ మత్కవుమ్ ఆరో భార్య హయా బింట్ ఆల్ హుస్సేన్ తన పిల్లలతో కలిసి పారిపోయారు. 31 మిలియన్ల ఫౌండ్ల నగదు(సుమారు రూ. 271 కోట్లు), తన పిల్లలు జలీల(11), జయేద్(7)తో కలిసి ఆమె వెళ్లిపోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వివాహ బంధం విచ్ఛిన్నం కావడంతో భర్తతో కలిసివుండటం ఇష్టంలేక ఆమె వెళ్లిపోయినట్టు తెలిపింది. లండన్‌లో ఆమె ఆశ్రయం పొంది ఉండొచ్చని భావిస్తున్నారు. ముందుగా జర్మనీ ఆశ్రయం కోరినప్పటికీ ఆమోదం లభించకపోవడంతో లండన్‌లో రహస్య ప్రాంతంలో ఆమె తలదాచుకున్నట్టు తెలుస్తోంది. మహ్మద్ బిన్ రషీద్ కుమార్తె షేక్ లతిఫా కూడా గతేడాది దుబాయ్ నుంచి పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. మితిమీరిన బంధనాల మధ్య బతకలేనంటూ తన తండ్రిని విమర్శిస్తూ పారిపోయేముందు యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. లతిఫాకు సాయం చేసినందుకు అప్పట్లో హయా విమర్శలు ఎదుర్కొన్నారు. జోర్డాన్ రాజు సోదరి అయిన హయా ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె మే 20 తర్వాత బహిరంగంగా కనబడలేదు. తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను తరచుగా పోస్ట్ చేసేవారు. ఫిబ్రవరి తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టలేదు. తనను వదిలిపెట్టి భార్య వెళ్లిపోవడంపై మహ్మద్ బిన్ రషీద్ తీవ్రంగా స్పందించారు. ఆమె వైఖరిని తప్పుబడుతూ అరబిక్‌లో కవిత రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన నమ్మకాన్ని వమ్ము చేసి మోసం చేసిందని.. ఆమె బతికున్నా చనిపోయినా తనకు అనవసరమని పేర్కొన్నారు. హయా వ్యవహారంపై స్పందించేందుకు బ్రిటీషు, యూఏఈ ప్రభుత్వాలు నిరాకరించాయి. -
పొలిటీషియన్ భార్యకు స్టంట్ మాస్టర్ ఝలక్
ముంబయి: అతడు పేరుమోసిన ఓ స్టంట్స్ మెన్. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖ బాలీవుడ్ హీరోలకోసం ఎన్నో స్టంట్స్ చేశారు. పూర్తి స్థాయిలో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని ఈ మధ్యే మాస్టర్ గా కూడా మారాడు. అయితే, ఇప్పటి వరకు మంచి స్టంట్స్ మెన్ గా పేరు సంపాధించుకున్న అతడు ఒక చెడ్డ అపవాదును మూటగట్టుకున్నాడు. పెద్ద దొంగతనాన్ని చేశాడు. రూ.2లక్షలకు ఆశపడి ఏకంగా రూ.98లక్షల విలువైన కారును దొంగిలించే ప్రయత్నం చేసి పోలీసుల చేతికి అడ్డంగా దొరికిపోయాడు. కారు కూడా ఓ రాజకీయ నాయకుడి భార్యది. వివరాల్లోకి వెళితే, శంషర్ ఖాన్(30) అనే వ్యక్తి బాలీవుడ్ చిత్రాల కోసం స్టంట్ మేన్ గా పనిచేస్తూ కుర్ల ప్రాంతంలో ఉంటున్నాడు. అతడికి అభయ్ పాటిల్ (42) అనే కారు డీలర్ కు, విజయ్ వర్మ అనే ఓ పని మనిషికి పరిచయం ఉంది. వెయిన్ గంగా అనే అపార్ట్ మెంట్లో పలువురు రాజకీయ నాయకులు, బిజినెస్ టైకూన్లు ఈ కాంప్లెక్స్ లో నివాసం ఉంటారు. ఇక్కడే ఓ పొలిటీషియన్, వ్యాపార వేత్త భార్య అయిన అభా బాఫ్నాకు రూ.98లక్షల విలువైన ఆడి ఏ 8(2008) కారు ఉంది. ఆ కారును ఎలాగైనా దొంగిలించి తనకు ఇవ్వాలని, అందుకు రూ.2లక్షలు ఇస్తానని స్టంట్ మెన్ అయిన శంషర్ ఖాన్ కు చెప్పడంతో అతడు విజయ్ వర్మ అనే పనిమనిషితో కలిసి ముందుగా అనుకున్న ప్రకారం ప్లాన్ అమలు చేశారు. పని మనిషి విజయ్ వర్మ తాళం చేతులు అందించగా తాఫీగా ఆ కారు వేసుకొని పాటిల్ కు ఇచ్చేందుకు నేవీ ముంబయి రోడ్డుపై వెళుతున్నాడు. దొంగతనం జరిగిన కాసేపటికే ఈ విషయం పోలీసులకు తెలిసి ముందుగానే రోడ్డుపై కాపలాకాశారు. అతడు స్టంట్ మాస్టర్ అని ముందే తెలిసి రోడ్డుపై నాకా బందీలు (బారీ గేడ్స్)లాంటివి పెట్టి అతడిని అడ్డుకున్నారు. మర్యాదగా అతడిని కారు దిగాలని చెప్పి అరెస్టు చేసి జైలుకు తరలించగా అసలు విషయం చెప్పాడు. మొత్తం ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వర్మ చేతికి తాళాలు ఎలా వచ్చాయనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. నాలుగు గంటల్లోనే పోలీసులు ఈ కేసు ఛేదించారు. -
అఫ్గాన్‌కు పరారైన పఠాన్‌కోట్ కుట్రదారుడు
లాహోర్: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) కీలక నాయకుడు, పంజాబ్ పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన వారికి ఫోన్లో సూచనలు ఇచ్చిన కుట్రదారుడు పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు పరారయ్యాడు. ఈ ఏడాది జనవరి రెండున ఎయిర్‌బేస్‌పై దాడికి ముందు ఇతడు వారితో 18 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పాకిస్తాన్ అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఈ ఉగ్రవాది పాక్ సరిహద్దులోని గిరిజన ప్రాంతంలో మకాం వేశాడు. పాక్ అధికారులు అక్కడికి వెళ్లేలోపే ఇతడు సరిహద్దు దాటి అఫ్గాన్‌లోకి ప్రవేశించాడని ప్రకటించిన పోలీసులు, నిందితుడి పేరు వెల్లడించడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్‌కు దాడికి పథకం పన్నిన వ్యక్తి తమ సంస్థను వదిలిపెట్టాడని జేఈఎం అధిపతి మసూద్ అజర్ ప్రకటించాడు. -
భర్తను చంపి నగలు, నగదుతో పరార్
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో దారుణం జరిగింది. భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు పిసికి హత్య చేసిందో భార్య. అనంతరం లక్షల విలువ చేసే నగలు, డబ్బుతో ఉడాయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన తారగా గుర్తించారు. మృతుడి కొడుకు భరత్ సింగ్ (14) ఇచ్చిన సమాచారంతో ఈ అమానుషం వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిర్మల్ సింగ్ (45) ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు భరత్ వికలాంగుడని సమాచారం. అయితే మొదటి భార్యకు విడాకులిచ్చిన నిర్మల్ సింగ్ నాలుగేళ్ల క్రితం తారను రెండో వివాహం చేసుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదుగానీ, సోమవారం రాత్రి సింగ్, ఆయన కుమారుడికి పథకం ప్రకారం నిద్రమాత్రలిచ్చింది. ఆ తర్వాత భర్తను గొంతునులిమి హత్యచేసి డబ్బు, నగలతో అక్కడినుంచి పరారయ్యింది. మంగళవారం మధ్యాహ్నానికి స్పృహలోకి వచ్చిన భరత్.. చుట్టుపక్కలవారికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే హత్య చేసిన అనంతరం తార.. భరత్ మొబైల్‌ఫోన్ ను కూడా తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏటీఎం క్యాష్ వ్యాన్ తో డ్రైవర్ పరారీ!
ముంబై:ఈమధ్య కాలంలో ఏటీఎం సెంటర్లలో చోరీలు మితిమిరిన సంగతి తెలిసిందే. ఇందుకు కొన్ని బ్యాంకులు భద్రతను మరింతగా పెంచి చోరీల నివారణకు చర్యలు చేపడుతున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఏకంగా ఏటీఏంలో జమ చేయాల్సిన క్యాష్ ను వ్యాన్ తో పాటు మిస్ చేస్తే ఏం చేయాలి. ఈ తరహా సంఘటనే వాణిజ్య రాజధాని ముంబైలో శుక్రవారం వెలుగుచూసింది. నవీ ముంబైలోని 'లాగీ క్యాష్'అనే సంస్థ సదరు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని ఏటీఎంలలో క్యాష్ ను జమ చేస్తుంది. ఆ క్యాష్ ను ఒక వ్యాన్ లో ఏటీఎంలకు తరలించడమే ఆ సంస్థ పని. అయితే లాగీ క్యాష్ లో పనిచేసే అమర్ సింగ్ అనే డ్రైవర్ క్యాష్ పై కన్నేశాడు. ఈరోజు కోటి రూపాయలకు పైగా ఏటీఎంలలో జమచేయాల్సింది.ఆ క్రమంలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు ఆవ్యాన్ చేరింది. అక్కడ రూ.16లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంది. క్యాష్ ను ఏటీఎంలో పెట్టడానికి సెక్యూరిటీ గార్డు ఏటీఎం మిషన్ ను డౌన్ చేశాడు. అప్పటికే బయట నిలుచుని ఉన్న ఆ డ్రైవర్ ఇదే అదునుగా భావించి అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన అధికారులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యాన్ తో డ్రైవర్ తీసుకుని పారిపోయిన డబ్బు విలువ ఒక కోటి 28 లక్షలు ఉంటుందని పోలీస్ అధికారి అన్సర్ పిర్జేజ్ తెలిపారు. అతను మతుంగ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించామన్నారు.