Youth Throws Off His Girlfriend, Flees After Being Held by Traffic Police - Sakshi
Sakshi News home page

వీడియో: ఓరి.. దుర్మార్గుడా..! చలానాకు భయపడి..

Published Tue, Aug 15 2023 5:32 PM | Last Updated on Mon, Aug 21 2023 4:06 PM

Youth Throws Off His Girlfriend Flees Away After Traffic Police Held - Sakshi

Viral Video: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత హితభోద చేసినా.. వాహనదారులు పెడచెవిన పెడుతుంటారు. తమ జీవితాలతో పాటు తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతుంటారు. ప్రయాణించే ముందే హెల్మెట్, సరైన ద్రువపత్రాలు వెంట తెచ్చుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అవేవీ లేకుండా రోడ్లపై వాహనాలను నడుపుతూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. చలానా తప్పించుకోవడానికి ఓ యువకుడు చేసిన పని తన లవర్‌ కిందపడిపోయేలా చేసింది.

ఓ యువకుడు తన ప్రేమికురాలితో బండిపై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. యువకుడు బండిని నెమ్మదిగా స్లో చేశాడు. అంతలోనే అక్కడికి ఓ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే యువకుడు చాలానా వేస్తాడేమోననే భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా బండి స్పీడ్‌ పెంచేసి సిగ్నల్‌ను దాటేయబోయాడు. అంతే వెనక ఉన్న యువతి అమాంతం కిందపడిపోయింది. ఆమెను పట్టించుకోకుండానే ఆ యువకుడు తప్పించుకున్నాడు.

అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ అమ్మాయిని పైకి లేపి ఆస్పత్రికి తరలించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ ఆనంద్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రాఫిక్‌లో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదని సూచనలు చేశారు. ఓరి దుర్మార్గుడా..! లవర్ కంటే చలానానే ఎక్కువై పోయిందా అంటూ ఫన్నీగా మరికొందరు కామెంట్ పెట్టారు.  

ఇదీ చదవండి: Indian Laws: ఆ వెసలుబాటు పురుషులకు లేదు.. అమ్మాయిల్ని దత్తత తీసుకోలేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement