away
-
రామ్మూర్తినాయుడూ బాబు బాధితుడే
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు మరణంతో అన్నదమ్ముల బంధంపై ఎల్లో మీడియా అదేపనిగా ప్రచారం చేస్తోంది. కానీ.. రామ్మూర్తినాయుడిని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఆయనతో కలిసి పనిచేసిన ఓ మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాలుగు సార్లు సీఎంగా పనిచేసినా రామ్మూర్తినాయుడిని చంద్రబాబు ఆర్థికంగా ఆదుకోలేదని ఆ మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. తమ్ముడిని రాజకీయంగానూ చంద్రబాబు ఎదగనీయలేదని, ఈ విషయాన్ని రామ్మూర్తినాయుడే పలు సందర్భాల్లో తనతో చెప్పారని 1994లో రామ్మూర్తినాయుడికి సహ ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.ఆయనకు ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లి చంద్రగిరి సీటు ఇప్పించింది లక్ష్మీపార్వతి అని పేర్కొన్నారు. టీడీపీలోనే ఉన్నా తమ్ముడికి సీటు ఇవ్వడాన్ని అప్పట్లో చంద్రబాబు వ్యతిరేకించారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పేవారని వివరించారు. 1995లో ఎన్టీఆర్ మరణం తర్వాత వెన్నుపోటు రాజకీయాలతో చంద్రబాబు టీడీపీని చేజిక్కించుకున్న తరువాత రామ్మూర్తినాయుడిని పట్టించుకోలేదని, 1999 ఎన్నికల్లో తమ్ముడికి సీటు ఇచ్చినా ఆయన గెలిచేందుకు సహకరించలేదని పేర్కొన్నారు.ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయినా తమ్ముడిని, ఆయన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారని చెప్పారు. ఆ సమయంలోనే అనేకసార్లు చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని, రాజకీయంగా అణచివేస్తున్నాడని రామ్మూర్తినాయుడు సన్నిహితులు, మీడియా వద్ద చెప్పుకుని బాధపడేవారని ఆ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా.. రామ్మూర్తినాయుడు మానసిక స్థితి బాగోలేకపోవడంతో ఆయన్ను గొలుసులతో కట్టేశారంటూ అప్పట్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.అన్నపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరికఈ బాధతోనే రామ్మూర్తినాయుడు 2004 ఎన్నికల్లో అన్న చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి కాంగ్రెస్‌లో చేరారు. చంద్రబాబుకు కుటుంబం అన్నా కనీస గౌరవం లేదని, బాధ్యత కూడా లేదని రామ్మూర్తినాయుడు అనేవారు. ఆయనకు రాజకీయమే ముఖ్యమని, అందుకోసం ఏదైనా చేస్తాడని చెప్పేవారు. తన కుటుంబాన్ని తానే చూసుకునేవాడినని అందువల్లే చంద్రబాబు రాజకీయాల్లో రాణించగలిగారని పలు ఆయన సందర్భాల్లో తెలిపారు.రాజకీయంగా ఎదిగిన తర్వాత హెరిటేజ్ తదితర చాలా ఆస్తులు సంపాదించినా తమ్ముడు సహా తన అక్క, చెల్లెలు గురించి చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని రామ్మూర్తి సహచరులు చెప్పారు. 2008 నుంచి అనారోగ్యంతో రామ్మూర్తినాయుడు మంచానపడ్డారు. ఆ తర్వాత ఆయన కుమారుడు నారా రోహిత్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపారు. 2014 ఎన్నికల్లో కుప్పం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అతన్ని కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి రానివ్వలేదని చెబుతారు. -
పారిపోను.. సాయం చేస్తా
శత్రు దేశాలు, ఉగ్రమూకలు, తీవ్రవాదులు విరుచుకుపడినప్పుడు ఎంత శక్తిమంతమైన దేశమైనా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఆ మధ్యన అప్ఘానిస్థాన్ పరిస్థితి ఇలానే ఉండేది. అది మర్చిపోయే లోపు ఉక్రేయిన్ రష్యా యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్ఘానిస్థాన్, ఉక్రెయిన్లలో ఏర్పడిన పరిస్థితులకు భయపడిపోయిన చాలామంది ప్రజలు ప్రాణాలు అరచేత బట్టి దేశం విడిచి పారిపోయారు. ఇక ఆయా దేశాల్లో ఉన్న విదేశీయులు ముందుగానే పెట్టే బేడా సర్దుకుని తమ తమ దేశాలకు పరుగెత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయినా అక్కడ నివసిస్తోన్న 41 ఏళ్ల ప్రమీలా ప్రభు మాత్రం ‘‘నేను ఇండియా రాను. ఇక్కడే ఉండి సేవలందిస్తాను’’ అని ధైర్యంగా చెబుతోంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా.. హెర్గాలో పుట్టి పెరిగింది ప్రమీలా ప్రభు. మైసూర్లో చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఉడిపిలోని మణిపాల్ ఆసుపత్రిలో నర్స్‌గా చేరింది. కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక, ఇజ్రాయేల్‌లో మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో.. తన ఇద్దరు పిల్లలతో ఇజ్రాయెల్‌కు వెళ్లింది. గత ఆరేళ్లుగా అక్కడే ఉంటోన్న ప్రమీలా ఆ దేశం మీద అక్కడి ప్రజల మీద మమకారం పెంచుకుంది. అందుకే పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ ... ‘‘ఇండియా నాకు జన్మనిస్తే.. ఇజ్రాయెల్ జీవితాన్నిచ్చింది. ఇలాంటి కష్టసమయంలో దేశాన్ని వదిలి రాను. నేను చేయగలిగిన సాయం చేస్తాను’’ అని కరాఖండిగా చెబుతూ అక్కడి పరిస్థితులను ఇలా వివరించింది.... నేను టెల్ అవీవ్ యాఫోలో నివసిస్తున్నాను. అక్టోబర్ 7తేదీన∙రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో భోజనం చేశాము. అప్పుడు ఎమర్జెన్సీ సైరన్ వినిపించింది. వెంటనే మేమంతా బంకర్లోకి వెళ్లిపోయాము. దాదాపు రాత్రంతా సైరన్ వినిపిస్తూనే ఉంది. నేను ఇజ్రాయెల్ వచ్చాక ఇంతపెద్ద హింసను ఎప్పుడూ చూడలేదు. మా ఇంటికి కిలోమీటర్ దూరంలో బాంబులు పడుతున్నాయి. పెద్దపెద్ద శబ్దాలు ఒక్కసారిగా భయపెట్టేశాయి. ఇక్కడ ప్రతి ఇంటికి బంకర్లు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా వీటిలోకి వెళ్లి తలదాచుకోవచ్చు. సైరన్ మోగిన వెంటనే కనీసం ముప్ఫైసెకన్లపాటు బాంబుల శబ్దాలు వినపడుతున్నాయి. దశాబ్దకాలంగా ఇజ్రాయెల్‌పై తీవ్రవాద సంస్థ హమాస్ దాడులకు తెగబడుతూనే ఉంది. హమాస్ వల్ల గాజా కూడా దాడులతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా చనిపోయారు. ఇక్కడి ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. టెల్ అవీవ్‌లో షాపులు అన్నీ మూసేసారు. వీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. అందరూ కిరాణా సామాన్లు తెచ్చుకుని నిల్వ చేసుకుంటున్నారు. అరగంట లోపలే... మా చెల్లి ప్రవీణ జెరుసలేంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నేను టెల్ అవీవ్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఈ అపార్ట్మెంట్లో ముఫ్పైమంది వరకు ఉన్నారు. మేమంతా అత్యవసరమైన ఆహారం, నీళ్లు, టార్చ్‌లైట్ వంటివాటిని దగ్గర ఉంచుకుని బేస్మెంట్ తలుపులు లె రుచుకుని ...సైరన్ రాగానే బంకర్లోకి పరుగెడుతున్నాం. సైరన్ ఆగినప్పుడు బంకర్ల నుంచి బయటకు వస్తున్నాం. బంకర్లోకి వెళ్లిన ప్రతిసారి అరగంట పాటు లోపలే ఉండాల్సి వస్తోంది. ఊహకందని దాడి ఇజ్రాయెల్‌మీద పాలస్తీనా దాడులు చేయడం ఇది కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరిగిన దాడి అస్సలు ఊహించలేదు. ఊహకందని వికృతదాడికి హమాస్ సంస్థ పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో శాంతికోసం ఏర్పాటు చేసిన ‘మ్యూజిక్ ఫెస్టివల్’ను ఇలా అశాంతిగా మారుస్తారని అసలు ఊహించలేదు. ఆ ఫెస్టివల్ గురించి అత్యంత బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ ఎప్పుడూ.. యుద్ధానికి అన్నిరకాలా సన్నద్ధమై ఉండి, రక్షణాత్మక చర్యలను పర్యవేక్షిస్తుంటుంది. లేదంటే మరింతమంది హమాస్ దాడుల్లోప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు రాలేను.. ఇజ్రాయెల్ నాకు జీవితాన్నిచ్చింది. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా మాతృదేశం వచ్చి సంతోషంగా ఉండలేను. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతిస్తే నా సేవలు అందించడానికి సిద్ధ్దంగా ఉన్నాను. ఉడిపిలో ఉన్న మా కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్ చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నానా... లేదా... అని కంగారు పడుతున్నారు. ఇక నా పిల్లలు ఇండియా వెళ్లిపోయారు. వారిని విడిచి ఇక్కడ ఉన్నాను. వాళ్లంతా గుర్తొస్తున్నారు. అయినా ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి పారిపోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇండియా తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’’ అని చెబుతూ ఎంతోమంది స్ఫూర్తిగా నిలుస్తోంది ప్రమీలా ప్రభు. -
ఓరి.. దుర్మార్గుడా..! చలానాకు భయపడి..
Viral Video: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత హితభోద చేసినా.. వాహనదారులు పెడచెవిన పెడుతుంటారు. తమ జీవితాలతో పాటు తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతుంటారు. ప్రయాణించే ముందే హెల్మెట్, సరైన ద్రువపత్రాలు వెంట తెచ్చుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అవేవీ లేకుండా రోడ్లపై వాహనాలను నడుపుతూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. చలానా తప్పించుకోవడానికి ఓ యువకుడు చేసిన పని తన లవర్ కిందపడిపోయేలా చేసింది. ఓ యువకుడు తన ప్రేమికురాలితో బండిపై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. యువకుడు బండిని నెమ్మదిగా స్లో చేశాడు. అంతలోనే అక్కడికి ఓ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే యువకుడు చాలానా వేస్తాడేమోననే భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా బండి స్పీడ్ పెంచేసి సిగ్నల్‌ను దాటేయబోయాడు. అంతే వెనక ఉన్న యువతి అమాంతం కిందపడిపోయింది. ఆమెను పట్టించుకోకుండానే ఆ యువకుడు తప్పించుకున్నాడు. लड़की को breakup में देर नहीं करनी चाहिए ऐसे बहुत आयेंगे जाएँगे यह लड़का गर्लफ़्रेंड के लिये एक चालान नहीं भर सका बीच सड़क बाइक से उतार दिया pic.twitter.com/BkUdzNq4Ls — Abhishek Anand Journalist 🇮🇳 (@TweetAbhishekA) August 14, 2023 అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ అమ్మాయిని పైకి లేపి ఆస్పత్రికి తరలించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ ఆనంద్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రాఫిక్‌లో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదని సూచనలు చేశారు. ఓరి దుర్మార్గుడా..! లవర్ కంటే చలానానే ఎక్కువై పోయిందా అంటూ ఫన్నీగా మరికొందరు కామెంట్ పెట్టారు. ఇదీ చదవండి: Indian Laws: ఆ వెసలుబాటు పురుషులకు లేదు.. అమ్మాయిల్ని దత్తత తీసుకోలేరు -
గుజరాత్లో వరద బీభత్సం.. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు
జునాగఢ్: గుజరాత్‌ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు నగరాలను సైతం నీట ముంచుతున్నాయి. వరద నీటితో నదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. నవసారి, జునాగఢ్, ద్వారక, భావనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్షం కుంభవృష్టి సంభవించింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాలనీల్లో ప్రవహించే వరద నీరు నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. వరదల్లో వస్తువులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. जूनागढ़ : मेघ तांडव… खिलौने की तरफ़ पानी में डूबती तैरती कारें, मुख्य सड़क पर पानी का ज़बरदस्त बहाव,#JunagadhRain pic.twitter.com/T7lesOoh86 — Janak Dave (@dave_janak) July 22, 2023 నవసారి జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. కాలనీలు వరద నీటితో బురదమయంగా మారాయి. జునాగఢ్‌లోనూ అదే పరిస్థితి. నవసారిలో 30.3 సెంటీమీటర్ల వర్షం సంభవించగా.. జునాగఢ్‌లో 21.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జులై 24 వరకు సౌరాష్ట్రలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ పక్కనే ఉన్న మహారాష్ట్రలోనూ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. మహారాష్ట్రాను కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. #WATCH | Maharashtra: Severe waterlogging witnessed in Yavatmal due to incessant rain in the region. pic.twitter.com/3iARiiBfbI — ANI (@ANI) July 22, 2023 ఇదీ చదవండి: నదిలో చిక్కుకున్న బస్సు.. 40 మంది అందులోనే.. వీడియో వైరల్.. -
కుక్కపిల్లలను భయపెట్టాలనుకున్నారు.. కానీ.. తల్లి కుక్క ఎంట్రీతో సీన్ రివర్స్..
కొత్త వ్యక్తులు కనిపిస్తే కుక్కలు మొరగడం ప్రారంభిస్తాయి. ఇంకా కోపం ఎక్కువ ఉన్న కుక్కలైతే అస్సలు ఊరుకోవు. వెంబడించి మరీ దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సమయాల్లో బెదిరిస్తే కొన్నికుక్కలు భయంతో పారిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది ఇద్దరు యువకులకు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియోలో చూపిన విధంగా.. ఇద్దరు యువకులు దారి వెంట మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారిని చూసిన రెండు కుక్క పిల్లలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. కుక్క పిల్లలే కదా..! అన్నట్లు ఒక్కసారిగా ముందుకు వచ్చి వాటిని బెదిరించే ప్రయత్నం చేశారు యువకులు. అంతే.. భయంతో వెనక్కి పరుగులు పెట్టాయి. కానీ అసలు ట్విస్టు ఇక్కడే ఎదురైంది ఆ యువకులకు. వెనక్కి వెళ్లిన కుక్క పిల్లలు తన తల్లిని తీసుకువచ్చాయి. తల్లి కుక్క భారీ ఆకారంలో ఉండటంతో యువకులు.. చచ్చాం.. రా.. బాబోయ్.. అన్నట్లు భయంతో వెనక్కి పరుగులు పెట్టారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. Don't underestimate anything, there is always something stronger than you! Made me laugh a lot! 🤣🤣pic.twitter.com/r8WWEP5NSA — Figen (@TheFigen_) July 8, 2023 వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. కుక్క పిల్లలే కదా..! అని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్ చేశారు. దేన్ని అండర్ ఎస్టిమేట్ వేయకూడదని.. దాని వెనకాల ఎంత పెద్ద బలం ఉంటుందో తెలియదని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసి మరికొంతమంది నవ్వులు కురిపించారు. కానీ కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరికొందరు. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
మదనపల్లె పర్యటనలో సీఎం జగన్ ఉదారత
-
అనవసర యుద్ధాలకు దూరం
వాషింగ్టన్: ఇకపై విదేశాల్లో జరిగే యుద్ధాలకు తమ బలగాలను పంపమని, అవన్నీ అంతులేని నిరర్థక యుద్ధాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న తమ సైనికులను వెనక్కు రప్పిస్తామన్నారు. కేవలం తమ దేశానికి ప్రమాదమైన టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు మాత్రమే ఈ సైన్యాన్ని ఉపయోగిస్తామన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ దశాబ్దాలుగా అమెరికా రాజకీయవేత్తలు విదేశాల పునర్నిర్మాణం, విదేశీయుద్ధాల్లో పోరాడటం, విదేశీ సరిహద్దులను కాపాడడం వంటి పనులపై లక్షల కోట్ల డాలర్లు వెచ్చించారన్నారు. కానీ ప్రస్తుతం అమెరికా సేనలు అమెరికాను, అమెరికా నగరాలను రక్షించేందుకు పరిమితమవుతున్నాయని, అమెరికా బలగాలు స్వదేశాలకు వస్తున్నాయని చెప్పారు. విదేశాల్లో జరిగే అనవసర యుద్ధాలకు సైన్యం వెళ్లదని, కానీ దేశానికి ముప్పుగా భావించే ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టదని చెప్పారు. తమకున్నంత సైనిక సంపత్తి ఎవరికీ లేదని, బలం చూపించే శాంతిని పరిరక్షిస్తామని వివరించారు. ఈ ర్యాలీకి జనం భారీగా హాజరయ్యారు. కరోనా నిబంధనలను పక్కనబెట్టిమరీ జనం హాజరుకావడం ట్రంప్‌నకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారని, ఆయుధాల హక్కును రద్దు చేస్తారని, ఆ పార్టీ నిండా వామపక్షవాదులున్నారని దుయ్యబట్టారు. క్యూబా, వెనుజులా విధానాలను డెమొక్రాట్లు అమలు చేస్తారని విమర్శించారు. డెమొక్రాట్ నాయకురాలు కమలా హారిస్‌పై నేరుగా విమర్శలు చేశారు. కరోనా సంక్షోభం నుంచి అమెరికా ఎకానమీని తొందరగా బయటకు రప్పించామని చెప్పుకున్నారు. -
హైవే.. నోవే!
► జాతీయ, రాష్ట్ర రహదారులకు దూరంగా మద్యం షాపులు ► ఏ మద్యం షాపైనా 500 మీటర్ల దూరంలో ఉండాల్సిందే ► మద్యం షాపులపై కొరడా ఝుళిపించిన సుప్రీంకోర్టు మార్కాపురం ప్రాంతంలో ► 144 షాపులకు ముప్పు ఆందోళనలో మద్యం వ్యాపారులు మార్కాపురం: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సుప్రీంకోర్టు మద్యం షాపులపై కొరడా ఝుళిపించింది. గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పును ఈ నెల 31వ తేదీలోపు అమలు చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించటంతో ఒక్కసారిగా మద్యం షాపుల యజమానుల్లో ఆందోళన మొదలైంది. జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం షాపులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో మార్కాపురం, కంభం, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, గిద్దలూరు, దర్శి, పొదిలిలో ఎక్సైజ్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 169 వైన్‌షాపులు నడుస్తున్నాయి. సమీపించిన గడువు సుప్రీంకోర్టు్ట ఆదేశాలతో ప్రస్తుతం రోడ్డుకు దగ్గరలో ఉన్న (సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం) 144 షాపులను జనవాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల యజమానులతో మాట్లాడుతున్నారు. షాపులను అత్యవసరంగా తొలగించాలని ఆదేశించడంతో వ్యాపారులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి మండల కేంద్రం రాష్ట్ర, లేదా జాతీయ రహదారికి అనుబంధంగా ఉంది. ఇప్పటి వరకూ ఎక్సైజ్ అధికారులు గుడికి, బడికి 100 మీటర్ల దూరం ఉంటే చాలనే నిబంధన ప్రకారం 2015లో మద్యం షాపులకు లైసె¯Œ్సలు ఇచ్చారు. తాజా నిబంధనలతో పరిస్థితి తారుమారైంది. మార్కాపురం పట్టణంలో 13, దర్శిలో 7, తాళ్లూరులో 4, రాజంపల్లిలో 1, పొదిలిలో 6, దొనకొండలో 3, దోర్నాలలో 3, కంభంలో 5 మద్యం షాపులను రాష్ట్ర రహదారికి దూరంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 31లోపు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. 2015లో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఏటా ప్రభుత్వానికి షాపు ఆధారంగా రూ.30 నుంచి రూ.45 లక్షల వరకు లైసెన్స్ ఫీజు కింద చెల్లిస్తున్నారు. మార్కాపురం సూపరింటెండెంట్ పరిధిలో ఏటా 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒంగోలు సర్కిల్ నుంచి సుమారు 54 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం తిరునాళ్ల సీజన్. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తే మద్యం షాపులన్నీ ఊరికి దూరంగా ఉంటాయి. తిరునాళ్లకు మద్యం తాగేందుకు శివారు ప్రాంతాలకు ఎవరొస్తారని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. దోర్నాల, మార్కాపురం, పెద్దారవీడు, త్రిపురాంతకం, కంభం, పొదిలి, దర్శి, కనిగిరి పట్టణాల మీదుగా పలు రాష్ట్ర, జాతీయ రహదారులున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పట్టణంలో ఉన్న షాపులను కూడా ఊరి బయటకు తరలించాలి్సన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం తీర్పు పాటించాల్సిందే ఈ నెల 31వ తేదీలోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారి పక్కన ఉన్న మద్యం దుకాణాలు తొలగిస్తాం. ఇక నుంచి వ్యాపారులు సుమారు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు వ్యతిరేకంగా యజమానులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్.హనుమంతురావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మార్కాపురం. -
విమాన ప్రయాణీకులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విమానం ప్రయాణం అంటే లగేజీ స్కానింగ్..హ్యాండ్ బ్యాగుల సెక్యూరిటీ తనిఖీలు ఓ పెద్ద తతంగం. అయితే ఇక విమాన ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగుల స్టాంపింగ్, ట్యాగింగ్ సమస్యలకు ఇక శుభం కార్డు పడినట్టే. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ బ్యూరో ఒక కొత్త పైలట్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పూర్తి భద్రతను నిర్వహించే సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఏఎస్) అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చెకింగ్ వ్యవస్థను గురువారం ప్రారంభించింది. హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, సంబంధిత ఇతర టెక్నాలజీతో సహాయంతో హ్యాండ్ బ్యాగుల తనిఖీని మరింత కట్టుదిట్టంగా చేపట్టనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోలకతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ఈ ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ పద్ధతిని అన్ని విమానాశ్రయాల్లో ప్రారంభించనున్నట్టు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సామాను భద్రత, స్క్రీనింగ్ సౌకర్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రయాణీకులకు హ్యాండ్ బ్యాగు టాగ్స్ , స్టాంపింగ్ కష్టాలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ పద్థతిని అవలంబిస్తున్నట్టు చెప్పింది. బాధ్యత బీసీఏఎస్ ది. -
మూఢనమ్మకాలను పారదోలాలి
చౌటుప్పల్ : శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా నేటికీ మూఢ నమ్మకాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి టి.రమేష్ అన్నారు. మండలంలోని లక్కారం మోడల్ స్కూల్లో శనివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చన్నారు. నేటి యువత శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించకుండా, మూఢనమ్మకాలను విశ్వస్తుందని పేర్కొన్నారు. ప్రశ్నించడం, పరిశోధించడం, విశ్లేషించడం ద్వారా ప్రతి విషయాన్ని సైన్స్ ద్వారా ఋజువు చేయవచ్చన్నారు. నిరక్ష్యరాస్యుల్లోని మూఢనమ్మకాలను పారదోలాల్సిన బాధ్యత అక్ష్యరాస్యులపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దీపాజోషి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ అవ్వారు గోవర్థన్, జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటరమణారెడ్డి, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భార్యను పుట్టింటికి తీసుకెళ్లారని..
శాలిగౌరారం తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లిన అత్తమామలు తిరిగి కాపురానికి పంపాలని ఓ వ్యక్తి సోమవారం రాత్రి మండలకేంద్రంలోని ఓ సెల్‌టవర్ ఆందోళన చేశాడు. సుమారు రెండు గంటలపాటు తీవ్ర ఉత్కంఠను కలిగించిన ఆ వ్యక్తిని పోలీసులు కిందకు దించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మనిమద్దె గ్రామానికి చెందిన పోలేపాక సుధాకర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపనీలో గత సంవత్సరం సూపర్వైజర్గా పనిచేశాడు. ఆ సమయంలో అదే కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న నేరేడుచర్ల మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన బైరి వసంతలు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు 5 మార్చి 2016న ఉప్పల్‌లోని సాయిబాబా దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మీర్‌పేట సీఐ రాములును కలిశారు. దీంతో ఆయన ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి విచారించగా వసంత తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయారు. సుధాకర్, వసంతలు మేజర్ కావడంతో మీ ఇష్టప్రకారం నడుచుకోవాలని సీఐ చెప్పారు. దీంతో సుధాకర్ తన సొంత గ్రామమైన మనిమద్దెకు వచ్చి కుటింబీకులతో కలిసి కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వసంత కుటింబీకులు, బంధువులు సుధాకర్‌ను పలుమార్లు ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా వసంత తల్లిదండ్రులు ఈనెల 23న వసంతను బలవంతంగా లాక్కెళ్లారు. ఆ సమయంలో అడ్డువచ్చిన సుధాకర్ తల్లిని చంపుతామని బెదిరించారు. వెంటనే సుధాకర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈనెల 24న సజ్జాపురం వెళ్లగా అక్కడ వసంత ఆచూకీ లభించలేదు. దీంతో వారి బంధువుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భార్యను కాపురానికి పంపకుండా తన అత్తమామలు వ్యవహరిస్తున్నారంటూ మనస్తాపానికి గురైన సుధాకర్ సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చివెళ్తూ సాయంత్రం మండలకేంద్రంలోని సెల్‌టవర్‌ను ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న సుధాకర్ తల్లిదండ్రులు, స్నేహితులతో పాటు ఎస్ఐ అయోధ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సుధాకర్‌కు నచ్చజెప్పి కిందకు దించేందుకు నానాహైరాన పడ్డారు. న్యాయం జరిగేలా చూస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు రాత్రి 7.30 గంటలకు సుధాకర్ సెల్‌టవర్ దిగికిందకు వచ్చాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
వ్యసనాలకు బానిసలు కావొద్దు
గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సెంటినరీకాలనీ : ఎంతో గొప్ప భవిష్యత్ కలిగిన విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూ కళాశాలలో సోమవారం విద్యార్థులో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. రానున్న కాలంలో విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉంటుందన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు కఠోర దీక్షతో కృషి చేయాలన్నారు. అప్పుడే లక్ష్యం నెరవేరి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని వివరించారు. ర్యాగింగ్, గంజాయి, అల్కహాల్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేయవద్దని ఆయన సూచించారు. ఈ కార్యాక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి, సీఐ దేవారెడ్డి, ఎస్సై ప్రదీప్‌కుమార్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిర్మానుష్యం... టూరిస్టు నగరం!
ఇస్తాంబుల్ః చారిత్రక టర్కిష్ నగరం ఇస్తాంబుల్... ఇప్పుడో దెయ్యాల దీవిలా కనిపిస్తోంది. టూరిజానికి ఎంతో ప్రసిద్ధి చెంది, ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే నగరం... ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. షాపింగ్ చేసేందుకు సైతం టూరిస్టులు భయపడిపోతున్నారు. ఎప్పుడూ రష్ గా కనిపించే షాపులు... ఖాళీగా కనిపించడమే ఇస్తాంబుల్ అంటే జనం భయపడిపోతున్నారనేందుకు పెద్ద నిదర్శనం. పర్యాటక నగరం ఇస్తాంబుల్ విమానాశ్రయంలో గతవారం ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించడంతో ఇప్పుడా ప్రాంతంలో అడుగు పెట్టేందుకే జనం భయపడిపోతున్నారు. టర్కీలోని అతి పెద్ద నగరం, వందల ఏళ్ళుగా టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఇస్తాంబుల్... ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులతో సందడిచేసే పర్యాటక నిలయం ఖాళీ వీధులతో దర్శనమిస్తోంది. గతవారం అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి ఉగ్రమూకలు నలభై మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న ఇస్తాబుల్.. టర్కీలోని అతి పెద్దనగరమే కాక, సాంస్కృతిక, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. యూరప్ ఆసియా ఖండాల మధ్య భాగంలో ఉన్న నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడ గుర్తించబడ్డాయి. చారిత్రక మాస్క్ లు, అద్భుతాలను తలపించే సందర్శనా స్థలాలు ఇస్తాంబుల్ నగరానికి తలమానికాలు. అటువంటి ప్రదేశం ఇప్పుడు ఉగ్రదాడుల భయోత్పాతానికి తలవంచాల్సి వస్తోంది. ఈ ఏడాది వరుసగా జరిగిన దాడులు స్థానిక ప్రజలనే కాక, టూరిస్టులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. టూరిస్ట్ జిల్లాగా పేరొందిన సుల్తానా మెట్ లోని రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్ళు సైతం పర్యాటకులు లేక అల్లాడుతున్నాయి. ఒకవేళ ఫైవ్ స్టార్ హోటళ్ళకు ఎవరైనా వచ్చినా.. అక్కడి పరిస్థితులే అదనుగా రూమ్స్ ధరలపై బేరాలాడుతున్నారు. ఇస్తాంబుల్ దాడుల ఘటన స్థానిక పరిస్థితులనేకాదు, తమ జీవితాలనూ తారు మారు చేసేసిందని ఓ టూరిస్ట్ గైడ్ చెప్పడం విశేషం. ఎన్నో ఏళ్ళుగా తాను అదే వృత్థిలో ఉన్నానని, ప్రసిద్ధ పర్యాటక నగరంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్తున్నాడు. దీనికి తోడు తొమ్మిది రోజుల అంతర్జాతీయ సెలవు ప్రకటించడం.. స్థానికులు సైతం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళడంతో ఇప్పుడదో దెయ్యాల దీవిలా కనిపిస్తోందంటున్నాడు. ఇస్తాంబుల్ లో జిహాదీల దాడి.. ఇప్పుడు టర్కీలోని టూరిస్ట్ ఇండస్త్రీనే తీవ్రంగా దెబ్బతీసిందని చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడి వ్యాపారులు సైతం విదేశాలకు తరలిపోతామంటున్నారని చెప్తున్నాడు. అయితే ఇటువంటి ఘటనలు ఇక్కడకు మాత్రమే పరిమితం కాదని, ఇలా ఏ దేశంలోనైనా జరగవచ్చని కొందరు టూరిస్టులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌరులంతా ఏకమై, ప్రభుత్వాల కృషితో ఉగ్రభూతాన్ని అణచివేస్తే తప్పించి ఈ పరిస్థితులు ఏ దేశానికైనా తప్పవని చెప్తున్నారు. -
నర్రా కన్నుమూత
షుగర్‌తో బాధపడుతున్న రాఘవరెడ్డి నార్కట్‌పల్లి కామినేనిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస నేడు నల్లగొండ జిల్లా వట్టిమర్తిలో అంత్యక్రియలు చిట్యాల/నార్కట్‌పల్లి/నకిరేకల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి(91) గురువారం సాయంత్రం అనారోగ్యంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో కన్నుమూశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వట్టిమర్తిలోని తన నివాసంలో ఆయన 20 రోజుల క్రితం జారి కిందపడ్డాడు. మధుమేహంతో బాధపడుతున్న నర్రా తీవ్ర అస్వస్థతకు గురవడంతో తొలుత హైదరాబాద్‌లోని నిమ్స్ అసుపత్రికి తరలించారు. కోలుకున్నాక పది రోజుల క్రితం వట్టిమర్తికి తీసుకువచ్చారు. కాగా గురువారం ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఉదయం 11 గంటల సమయంలో నార్కట్‌పల్లి శివారులోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సాయంత్రం ఆరు గంటల సమయంలో నర్రా మృతిచెందారు. ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం నల్లగొండలోని సీపీఎం కార్యాలయానికి తరలించారు. శుక్రవారం ఆయన స్వగ్రామం వట్టిమర్తిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. నర్రా మరణవార్త తెలుసుకున్న సీపీఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పార్టీలు, నేతల సంతాపం సాక్షి, హైదరాబాద్: నర్రా రాఘవరెడ్డి మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాఘవరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని శ్లాఘించారు. నర్రా మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. నర్రాకు జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబసభ్యులకు సీపీఎం తరఫున పార్టీ తెలంగాణ కార్యదర్మి తమ్మినేని వీరభద్రం సానుభూతి వ్యక్తంచేశారు. అట్టడుగు నుంచి అగ్ర స్థాయికి.. సీపీఎం విధానాలకు ఆకర్షితుడైన నర్రా రాఘవరెడ్డి 1949లో పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత వట్టిమర్తి గ్రామ శాఖ కార్యదర్శిగా మొదలుకుని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడి వరకు వివిధ హోదాల్లో పని చేశారు. 1959లో వట్టిమర్తి సర్పంచ్‌గా ఎన్నికై ఏడేళ్ల పాటు కొనసాగారు. 1967లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. తొలి ప్రయత్నం లోనే శాసనసభకు ఎన్నికయ్యారు. 1972లో జరిగిన ఎన్నికల్లో పార్టీలో వర్గ విభేదాల వల్ల ఓటమి పాలయ్యారు. 1978 నాటికి పార్టీని నియోజకవర్గంలో పటిష్టం చేసి తిరిగి గెలుపొందారు. అప్పటినుంచి వరుసగా 1984, 1989, 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 1983 నుంచి ఏడేళ్లపాటు శాసన సభలో సీపీఎంపక్ష నాయకుడిగా పని చేశారు. 1999 తర్వాత వయస్సు మీద పడటం, అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. -
అందుబాటులో ధరలు
=సరసమైన రేట్లకే కూరగాయలు =రైతుబజార్లో టమాటా, మిర్చి కిలో రూ.12 సాక్షి, సిటీబ్యూరో : నగరంలో కూరగాయ ధరల చిటపట బాగా తగ్గిపోయింది. గత నెలతో పోలిస్తే... ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు సరసమైన ధరలకే లభిస్తుండటం వినియోగదారులకు ఊరట కల్గిస్తోంది. ప్రధానంగా అన్ని వర్గాల ప్రజలు నిత్యం వినియోగించే టమాటా, మిర్చి దిగుబడి అనూహ్యంగా పెరగడంతో ధరలు కూడా కిందికి దిగివచ్చాయి. గత నెల మొదటి వారంలో రైతుబజార్లో పచ్చిమిర్చి, టమోటా కిలో రూ.32-35లకు విక్రయించగా, రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40లు ధర పలికాయి. ఇప్పుడవి రైతుబజార్లో కేజీ రూ.12ల కే లభిస్తున్నాయి. అదే రిటైల్ మార్కెట్లో అయితే ఈ రేట్లకు మరో రూ.4-8లు అదనంగా వసూలు చేస్తున్నారు. తగ్గిన ధరలు ఒక్క టమాటా, పచ్చిమిర్చికే పరిమితం కాకుండా మిగతా కూరగాయలు కూడా ఇప్పుడు వినియోగదారుడికి అందుబాటులోనే ఉన్నాయి. అలాగే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధర కూడా అనూహ్యంగా కిందికి దిగివచ్చింది. ప్రస్తుతం నాణ్యమైన ఉల్లి కేజీ రూ.18-20లకే లభిస్తోంది. సీజన్ ప్రారంభం కావడంతో అన్నిరకాల కూరగాయల దిగుబడి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం బోయిన్పల్లి, గుడిమల్కాపూర్ హోల్‌సేల్ మార్కెట్లతో పాటు మాదన్నపేట, మీరాలంమండి మార్కెట్లకు రోజుకు 55వేల క్వింటాళ్లకు పైగా అన్నిరకాల కూరగాయలు దిగుమతవుతుండగా, నగరంలోని 9 రైతుబజార్లకు 10వేల క్వింటాళ్ల వరకు కూరగాయలను రైతులు తీసుకువస్తున్నారు. కూరగాయల ధరలు రైతుబజార్లలోనే కాదు బహిరంగ మార్కెట్లలో కూడా కిందికి దిగివచ్చాయి. తీరిన కొరత నగర అవసరాలకు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు వస్తుండటంతో కొరత అనేది ఎక్కడా కన్పించట్లేదు. రోజుకు 55వేల క్వింటాళ్ల కూరగాయలు కావాల్సి ఉండగా, ఆదివారం 75వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతైనట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో నగరంలోని 9 రైతుబజార్లకు 20 టన్నుల వరకు సరఫరా అయ్యాయి. ప్రస్తుతం అన్ని రకాల కూరగాయలు అందుబాటు ధరల్లో ఉండటంతో డిమాండ్-సరఫరాల మధ్య సమతుల్యం ఏర్పడింది. దిగుబడులు అధికం కావడంతో రైతుబజార్లో బోర్డుపై రాసిన ధర కంటే మరీ తగ్గించి రైతులు తమ సరుకు అమ్ముకొంటున్నారు. ఆదివారం కూకట్పల్లి, ఎర్రగడ్డ రైతుబజార్లలో చిక్కుడు కేజీ రూ.22లు ధర బోర్డుపై రాయగా రైతులు మాత్రం కేజీ రూ.16లకే విక్రయించారు. అలాగే రూ.27 ధర ఉన్న క్యారెట్ రూ.20లకు, రూ.12లున్న కాలీఫ్లవర్ రూ.8ల ప్రకారం అమ్మారు. మరో వారం రోజుల్లో టమాటా, మిర్చి, బెండ, దొండ, చిక్కుడు, కాకర, బీర వంటి వాటి ధరలు సింగిల్ డిజిట్లోకి (కేజీ రూ.10లోపు) పడిపోయే అవకాశాలున్నాయి. -
నేడు పద్మనాభరెడ్డి అంత్యక్రియలు