పాక్ బృందానికి వీసా మంజూరు | Granted a visa to Pak team | Sakshi
Sakshi News home page

పాక్ బృందానికి వీసా మంజూరు

Published Sat, Mar 26 2016 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

Granted a visa to Pak team

‘పఠాన్‌కోట్’పై దర్యాప్తునకు జేఐటీ
 

 ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ వైమానిక క్షేత్రంపై పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారన్న ఆరోపణలపై దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు పాక్ బృందం భారత్‌కు వస్తోంది. పాక్ సంయుక్త దర్యాప్తు బృందం(జేఐటీ)లోని ఐదుగురు అధికారులకు భారత్ వీసా మంజూరుచేసింది. వీరు భారత్‌కు వెళ్లి పఠాన్‌కోట్ దాడి  సంబంధించిన ఆధారాలు సేకరిస్తారని  ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్  ప్రతినిధి చెప్పారు.

ఈనెల 27న భారత్‌కు బయలుదేరుతున్న ఈ బృందంలో మిలిటరీ ఇంటెలిజెన్స్‌తోపాటు పోలీసు అధికారులున్నారు. 28న వీరు ఘటనాస్థలికి వెళ్లనున్నారు. పాక్ పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) చీఫ్ అయిన అడిషనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముహమ్మద్ తాహిర్ రాయ్ ఈ బృందానికి నేతృత్వ వహిస్తారు. ఇటీవల కఠ్మాండులో జరిగిన సార్క్ మంత్రుల సమావేశాల్లో భారత్, పాక్ విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, అజీజ్‌ల భేటీలో జేఐటీ బృందం రాకకు భారత్ అనుమతించింది.

 ఎస్పీ సల్వీందర్‌కు ఎన్‌ఐఏ తాజా సమన్లు
 న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి కేసులో పంజాబ్ పోలీసు ఎస్పీ సల్వీందర్ సింగ్ తో పాటు మరో ఇద్దరికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తాజాగా సమన్లు జారీచేసింది. సాధారణ దర్యాప్తులో భాగంగానే సింగ్‌తోపాటు అతని స్నేహితుడు రాజేష్ వర్మ, వంటమనిషి మదన్ గోపాల్‌ను తమ ముందు హాజరవ్వాలని ఆదేశించామని ఎన్‌ఐఏ వర్గాలు చెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement