![జగదీశ్‌చంద్‌కు కీర్తిచక్ర](/styles/webp/s3/article_images/2017/09/3/71458680435_625x300.jpg.webp?itok=-tRG-v1Y)
జగదీశ్‌చంద్‌కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి ఘటనలో విరోచితంగా పోరాడి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టి మృతిచెందిన సిపాయి జగదీశ్ చంద్‌ను కేంద్రం కీర్తి చక్రతో గౌరవించింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించి, అత్యున్నత, అసాధారణ సేవలు కనబరిచిన సైనికులకు ఇచ్చే శౌర్య అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది.
ప్రాణాలు సైతం లెక్క చేయక ప లు సందర్భాల్లో సేవలు అందించిన మొత్తం 58 మందికి రాష్ట్రపతి ప్రణబ్ పతకాలను అందజేశారు. సభికుల చప్పట్ల నడుమ చాంద్ తరఫున ఆయన భార్య కీర్తిచక్ర(సైనికులకు ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం) అవార్డును అందుకున్నారు.