పాక్ హామీ ఇచ్చింది: రాజ్నాథ్ | Pakistan assured us of action, Rajnath Singh says on Pathankot attack | Sakshi
Sakshi News home page

పాక్ హామీ ఇచ్చింది: రాజ్నాథ్

Published Tue, Jan 12 2016 4:45 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

పాక్ హామీ ఇచ్చింది: రాజ్నాథ్

పాక్ హామీ ఇచ్చింది: రాజ్నాథ్

న్యూఢిల్లీ: పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సూత్రదారులపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్  సింగ్ చెప్పారు. పాక్ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలని, అంతవరకు ఎదురు చూడాలని రాజ్నాథ్ పేర్కొన్నారు. పఠాన్కోట్ దాడి సూత్రధారులపై చర్యలు తీసుకునే విషయంలో పాక్ చిత్తశుద్ధిని అనుమానించడానికి ప్రస్తుతానికి ఎలాంటి కారణం లేదని చెప్పారు.

పఠాన్కోట్ దాడి సూత్రధారులను పట్టుకునేందుకు పాక్ చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అత్యున్నత స్థాయి అధికారులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పాక్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement