ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని చైనా స్పష్టం చేసింది.
బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వం, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ విషయాల్లో తమ వైఖరిలో మార్పు ఉండబోదని చైనా స్పష్టం చేసింది.
ఇప్పటికే ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యత్వాన్ని అడ్డుకున్న చైనా.. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని ఐకరాజ్యసమితిలో రెండుసార్లు వ్యతిరేకించింది. ఇప్పుడు తాజాగా ఈ రెండు అంశాల్లో తమ వైఖరి మారదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుయాంఘ్ స్పష్టం చేశారు.