
నేడు చైనాకు రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం చైనా బయలుదేరి వెళ్లనున్నారు. భారత్‌తో చైనాకు ఉన్న వివాదాంశాలతో సహా ఈ పర్యటనలో పలు కీలకాంశాలపై చర్చిస్తారు. జై షే ఉగ్ర సంస్థ నాయకుడు మసూద్ అజహర్ విషయంలో చైనా అడ్డుపడుతుండటం, అణుశక్తి వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తప్పక సంతకం చేయాలనడం తదితర విషయాలపై చర్చించనున్నారు.