బీజింగ్/ఐక్యరాజ్యసమితి: పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు చైనా మరోసారి అండగా నిలిచింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి వీలుగా ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నాలుగోసారి అడ్డుకుంది. మసూద్‌పై నిషేధం విధించే విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. చైనా ఇంతకుముందు మసూద్‌పై నిషేధాన్ని సాంకేతికంగా నిలుపుదల చేసిన గడువు మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు భద్రతా మండలికి తెలిపింది. మసూద్‌పై నిషేధానికి చైనా తప్ప భద్రతా మండలిలోని 14 దేశాలు అంగీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment