Pathankot case
-
‘రూ.కోటి సిద్ధం చేసుకో లేదా..’ గ్యాంగ్‌స్టర్ ఫోన్.. చివర్లో అదిరే ట్విస్ట్!
చండీగఢ్: అపరిచితులు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సంఘటనలు చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి. అదే విధంగా ఓ గ్యాంగ్‌స్టర్ ఓ వ్యక్తికి ఫోన్ చేసి రూ.1 కోటి సిద్ధం చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించాడు. చిరు వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తికి కాల్ చేసింది అతడి మనవడే. ఈ సంఘటన పంజాబ్‌లోని పటాన్‌కోట్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదు దారు తన దుకాణం నుంచి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి 8.50 గంటల ప్రాంతంలో టీవీ చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. తాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, తనకు ‘ఖోఖా’ (రూ.1కోటి) ఇవ్వాలని లేదా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించాడు. ఆ మాట విని ఆందోళన చెందిన పెద్దాయన వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. దీంతో భయాందోళన చెందిన ఆ వృద్ధుడు కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారి ప్రోత్సాహంతో షాపుర్ కండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘నేను ఆశ్చర్యపోయా, నేను పెద్ద వ్యాపారవేత్తను కాదు. నాకు భూములు, ఇతర ఆస్తులు లేవు. గ్యాంగ్ స్టర్ నాకేందుకు ఫోన్ చేశాడని ఆశ్చర్యమేసింది.’ అని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గ్యాంగ్‌స్టర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు బాధితుడి మనవడే అని తేలింది. తన తాతను బెదిరించేందుకు కొత్త సిమ్ కొనుగోలు చేసినట్లు గుర్తించామని డిప్యూటీ సబ్ ఇన్స్పెక్టర్ రాజిందర్ మంహాస్ తెలిపారు. నిందితుడిపై పలువు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లింట విషాదం: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. వరుడి పరిస్థితి విషమం -
అజర్‌పై నిషేధాన్ని మళ్లీ అడ్డుకున్న చైనా
బీజింగ్/ఐక్యరాజ్యసమితి: పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు చైనా మరోసారి అండగా నిలిచింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి వీలుగా ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నాలుగోసారి అడ్డుకుంది. మసూద్‌పై నిషేధం విధించే విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. చైనా ఇంతకుముందు మసూద్‌పై నిషేధాన్ని సాంకేతికంగా నిలుపుదల చేసిన గడువు మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు భద్రతా మండలికి తెలిపింది. మసూద్‌పై నిషేధానికి చైనా తప్ప భద్రతా మండలిలోని 14 దేశాలు అంగీకరించాయి. -
కోర్టుకు ముగ్గురే!
అదుపులో 30 మంది.. * పఠాన్‌కోట్ కేసులో పాక్ అధికారుల తీరు లాహోర్: భారత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి పాక్‌లో ప్రారంభమైన ఉన్నతస్థాయి దర్యాప్తులో భాగంగా అదుపులోకి తీసుకున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఆదివారం కోర్టులో హాజరుపర్చారు. దర్యాప్తులో భాగంగా 31 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుండగా, వారిలో ముగ్గురినే సియాల్కోట్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో హాజరుపర్చడం విశేషం. వారిపై పఠాన్‌కోట్ దాడికి సంబంధించి కాకుండా.. జీహాదీ సాహిత్యాన్ని కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురినీ విచారణ నిమిత్తం 3 రోజుల పోలీసు రిమాండ్‌కు జడ్జి ఆదేశించారు. అయితే, పఠాన్‌కోట్ దాడిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతున్నందున.. ఆ దర్యాప్తు పూర్తయ్యేంతవరకు ఎవరిపైన కూడా ఆ ఘటనకు సంబంధించి కేసులు నమోదు చేయడం కుదరదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాడికి బాధ్యులంటూ ఎవరినీ కోర్టులో హాజరుపర్చడం కూడా సాధ్యం కాదని స్పష్టం చేశాయి. కాగా, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ అరెస్ట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో భారత్ ఒత్తిడి మేరకు ఆయనను అరెస్ట్ చేశారని పాక్ మీడియా చెబుతుండగా.. ఆయన భద్రత నిమిత్తమే అదుపులోకి తీసుకున్నాం కానీ అరెస్ట్ చేయలేదంటూ పంజాబ్ న్యాయశాఖ మంత్రి రానా సనావుల్లా స్పష్టం చేశారు.