'తాలిబాన్లకు ఆయుధాలు సరఫరా చేశాను'
'తాలిబాన్లకు ఆయుధాలు సరఫరా చేశాను'
Published Sun, Mar 23 2014 1:21 PM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ తాలిబాన్ కు తాను ఆయుధాలు సరఫరా చేశానని సీరియల్ కిల్లర్, బికినీ కిల్లర్ గా పేరొందిన చార్లెస్ శోభరాజ్ వెల్లడించారు. తీహార్ జైల్లో జైష్ ఏ మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజర్ తనకు పరిచయం ఏర్పడిందని శోభరాజ్ తెలిపారు. అంతేకాకుండా అమెరికా గూఢచార సంస్థ సీఐఏతో కూడా గతంలో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు.
1999 డిసెంబర్ లో కాట్మండ్ నుంచి కాంధార్ వెళ్లే ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ తర్వాత ప్రయాణికులను విడిపించేందుకు మసూద్ తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిచిపెట్టారని.. ఆతర్వాత తాను మసూద్ లు కలుసుకున్నామని.. ఆయుధాల కోసం తాలిబాన్లు మాదక ద్రవ్యాలను అమ్మేవారని శోభరాజ్ తెలిపారు. మసూద్ తో ఉన్న పరిచయంతో తాలిబాన్లకు చైనా నేరస్థులతో కలిసి ఆయుధాల డీలర్ గా పనిచేశానన్నారు.
అరెస్ట్ అయ్యాక తనతో సీఐఏతో తెగతెంపులు చేసుకుందని, తనకు ఎలాంటి సహాయం చేయలేదని, ఉగ్రవాదంపై పోరాటానికి తాను తన ప్రాణాలను పణంగా పెట్టానని శోభరాజ్ అన్నారు. 2003లో ఇరాక్ యుద్ద సమయంలో సద్దాం హుస్సేన్ ఏజెంట్ ను తాను కలిశానని శోభరాజ్ అన్నారు.
తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి స్వీట్స్ లో మత్తు మందు కలిపి ఇచ్చి 1986లో జైలు నుంచి పరారయ్యాడు. అమెరికా మహిళ కొనీ జో బ్రాజించ్ హత్య కేసులో కాట్మండ్ జైలులో సుమారు 20 ఏళ్లు శిక్ష అనుభవించాడు. శోభరాజ్ తన జీవిత కాలంలో 50 శాతం పలు నేరాల్లో శిక్ష అనుభవించాడు. తన జీవితంలో అనేక విషయాలను ఇటీవల మీడియాతో పంచుకున్నాడు.
Advertisement
Advertisement