objectionable content
-
NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: మదర్సాల్లో విద్యార్థులకు సరైన విద్య బోధించడం లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. చాలావరకు మదర్సాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడి పాఠ్యపుస్తకాల్లో అభ్యంతకర అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా సమగ్ర అఫిడవిట్ సమరి్పంచింది. నాణ్యమైన, సమగ్రమైన విద్య పొందడం బాలల ప్రాథమిక హక్కు కాగా, ఆ హక్కు మదర్సాల్లో ఉల్లంఘనకు గురవుతోందని ఆక్షేపించింది. విద్యాహక్కు చట్టం–2009 సైతం ఉల్లంఘనకు గురవుతున్నట్లు తెలియజేసింది. మదర్సాల్లో తగిన విద్యా బోధన జరగకపోగా, మరోవైపు ఆరోగ్యకరమైన వాతావరణం, జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడం లేదని అఫిడవిట్లో స్పష్టంచేసింది. బిహార్, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ముస్లిమేతరులను సైతం చేర్చుకొని, ఇస్లామిక్ మత విద్య బోధిస్తున్నారని తప్పుపట్టింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)కు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. ‘‘మదర్సాల్లో బోధిస్తున్న విద్య పిల్లలకు పూర్తిగా ఉపయోగపడేది కాదు. అక్కడ సరైన పాఠ్యప్రణాళిక లేదు. విద్యాహక్క చట్టం సెక్షన్ 29లో పేర్కొన్న మూల్యాంకన విధానాలు అమలు కావడం లేదు. అర్హత లేదని ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. నిధుల విషయంలోనూ పారదర్శకత కనిపించడం లేదు. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను లెక్కచేయకుండా చాలావరకు మదర్సాలు సొంతంగానే ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. వారికి తగిన విద్యార్హతలే ఉండడం లేదు. మదర్సాల్లో సంప్రదాయ విధానాల్లో ఖురాన్‌తోపాటు ఇతర మత గ్రంథాలు బోధిస్తున్నారు. ఇదంతా అసంఘటితమైన, అసంబద్ధమైన విద్యా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. పాఠ్యాంశాలు అభ్యంతకరంగా ఉంటున్నాయి. అత్యున్నత మతం ఇస్లాం మాత్రమే అని పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు’’ అని పేర్కొంది. -
కాళికాదేవి ట్వీట్‌పై ఉక్రెయిన్ క్షమాపణలు
కీవ్: కాళికా దేవతను కించపరిచేలా చేసిన ట్వీట్‌పై ఉక్రెయిన్ భారత్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆ దేశపు విదేశాంగ శాఖ ఉప మంత్రి ఎమిన్ జాపరోవా ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. జరిగిందానికి ఎంతో చింతిస్తున్నాం. భారత దేశపు ప్రత్యేకమైన సంప్రదాయాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం. అలాగే భారత్ నుంచి మద్దతును ఎప్పడూ ఆశిస్తాం అని పేర్కొందామె. హిందూ దేవత కాళిని అవమానించేలా ఉన్న చిత్రాన్ని ఇప్పటికే తొలగించామని, ఇరు దేశాల స్నేహం మునుపటిలా.. మరింత బలంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. పేలుడు పొగలో కాళి దేవత చిత్రాన్ని అభ్యంతరంగా చిత్రీకరిస్తూ ఉక్రెయిన్ రక్షణ శాఖ ఓ ట్వీట్ చేసింది. హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో ‘ఫ్లైయింగ్ స్కర్ట్ ఫోజు’లో కాళికా దేవి తలను మార్ఫింగ్ చేసి.. స్కర్ట్ ప్లేసులో బాంబు నుంచి వెలువడే పొగతో ఎడిట్ చేసి మరీ ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో హిందూ సమాజం భగ్గుమంది. యుద్ధంలో సాయం చేస్తుంటే.. ఇలాగేనా వ్యవహరించేందంటూ తిట్టిపోశారు నెటిజన్లు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కాంచన గుప్తా సైతం ఈ ట్వీట్‌పై మండిపడ్డారు. హిందువుల మనోభావాలపై జరుగుతున్న దాడి ఇదని పేర్కొన్నారామె. ఉక్రెయిన్ నుంచి క్షమాపణలు సైతం డిమాండ్ చేశారు. ఈ తరుణంలో తాజాగా ఉక్రెయిన్ క్షమాపణలు చెప్తూ.. ఆ ట్వీట్‌ను తొలగించింది. We regret @DefenceU depicting #Hindu goddess #Kali in distorted manner. #Ukraine &its people respect unique #Indian culture&highly appreciate🇮🇳support.The depiction has already been removed.🇺🇦is determined to further increase cooperation in spirit of mutual respect&💪friendship. — Emine Dzheppar (@EmineDzheppar) May 1, 2023 ఇదీ చదవండి: రండి బాబూ రండి.. తుపాకీ ఇవ్వండి, గిఫ్ట్ కార్డు తీసుకెళ్లండి -
నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీం కోర్టు ఫైర్
న్యూఢిల్లీ: బాలాజీ టెలిఫిలింస్ అధినేత, ప్రముఖ టీవీ.. ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన కంటెంట్ తెరకెక్కిస్తూ.. యువతరం మనసులను కలుషితం చేస్తున్నారని మండిపడింది. ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్‌పై నమోదు అయిన ఓ కేసులో ఏక్తా కపూర్ సుప్రీంను ఆశ్రయించగా.. ప్రతిసారీ ఇలాంటి వివాదాలతో కోర్టును ఆశ్రయించడం మంచి పద్దతి కాదంటూ ఆమెకు హితవు పలికింది కోర్టు. మరోసారి ఈ తరహా చర్యల్ని పునరావృతం చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తనపై జారీ అయిన అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పైవ్యాఖ్యలు చేసింది. ఏక్తా కపూర్ సమర్పణలో ఓటీటీ ప్లాట్‌ఫాం ఆల్ట్‌బాలాజీ (ALTBalaji)లో ట్రిపుల్ ఎక్స్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే xxx సీజన్ 2లో సైనికుని భార్య పోర్షెన్కు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ శంభు కుమార్ అనే మాజీ సైనికుడు 2020లో ఫిర్యాదు చేశారు. సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బిహార్‌లోని బేగుసరాయ్ ట్రయల్ కోర్టు ఏక్తా కపూర్‌ను అరెస్టు చేసేందుకు వారంట్లు జారీ చేసింది. ఈ అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది త్వరగా విచారణకు వస్తుందనే ఆశ లేదని చెప్పారు. ఇటువంటి కేసులో గతంలో అత్యున్నత న్యాయస్థానం ఏక్తా కపూర్‌నకు ఉపశమనం కల్పించిందని గుర్తు చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫాంపై ప్రసారమవుతున్న కంటెంట్ సబ్స్క్రిప్షన్ ఆధారితమైనదని తెలిపారు. ఈ దేశంలో తమకు నచ్చిన కంటెంట్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. దీనిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని ముకుల్ రోహత్గికు సూచించింది. ప్రజలకు మీరు ఎలాంటి ఛాయిస్‌ను ఇస్తున్నారా? అని నిలదీసింది. అసభ్యకరమైన కంటెంట్‌తో యువతను పాడు చేయాలనుకుంటున్నారా? యువతరం మనసులను కలుషితం చేస్తున్నారంటూ దుయ్యబట్టింది. మంచి న్యాయవాదులు ఉన్నంత మాత్రానా కోర్టులు నోరున్న వారి కోసమే పని చేయవని, నోరు లేని వారి కోసం కూడా పని చేస్తుందని జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సీటీ రవి కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఆర్డర్‌ను పరిశీలించాం, మా అభ్యంతరాలు మాకు ఉన్నాయి. హైకోర్టులో విచారణ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి స్థానిక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తూ.. ఈ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెట్టింది. ఇదీ చదవండి: యూట్యూబ్, గూగుల్‌కి కోర్టు నోటీసులు.. అవెలా వస్తున్నాయ్? -
అఫ్గన్ అరాచకాల వైరల్.. కట్టడికి ప్రయత్నాలు షురూ!
అఫ్గన్ నేల మీద మొదలైన తాలిబన్ల ఆరాచకాలు.. చాలా మీడియా, సోషల్ మీడియా హౌజ్‌లలో ఇప్పుడు ఇదే శీర్షిక వార్త. బుర్ఖాలో ఉన్న కొందరు ఆడవాళ్లను.. నడిరోడ్డు మీద వేలం వేస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో తాలిబన్ పేరిట విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. కానీ, ఇది ఇప్పటి వీడియో కాదు. 2014లోది. పైగా అది యాక్టింగ్ వీడియో. కుర్షీద్ యాక్టివిస్టులు.. ఇరాక్‌లో ఐసిస్ దురాగతాలను లండన్ వీధిలో ఇలా ప్రదర్శన చేసి చూపించారు. ఇలా తాలిబన్ ఆరాచకాల పేరుతో ఫేక్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండడంపై సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ అప్రమత్తం అయ్యాయి. అప్గన్, అప్ఘనిస్థాన్, తాలిబన్.. ఇప్పుడు ఈ పరిణామాలే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఓవైపు ఫేక్ ఫొటోలు, వీడియోలు, తాలిబన్ల ఆరాచకాలు పాత ఘటనలతో పాటు మరోవైపు ఆ దేశంలోని తాజా పరిస్థితులకు సంబంధించిన కంటెంట్ తెర మీదకు వస్తోంది. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు పెద్ద తలనొప్పి మొదలైంది. ఫేక్, ఓల్డ్ కంటెంట్‌తో పాటు తాజా అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు.. హింసాత్మక వీడియోలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అలాంటి కంటెంట్‌ను వైరల్ చేసే అకౌంట్లపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఫేస్బుక్-ఇన్‌స్టా ఫేక్, పాతతో పాటు అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించే పనిని మొదలుపెట్టినట్లు ఫేస్బుక్ ప్రకటించుకుంది. తాలిబన్ నిషేధిత జాబితాలో ఉండడం, ఆ గ్రూప్ ప్రమోట్ చేసే కంటెంట్ కట్టడికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. మరోవైపు అఫ్గన్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. రెచ్చగొట్టే, అభ్యంతరకర ఫొటో స్టోరీలను సైతం అనుమతించబోమని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సెరి స్పష్టం చేశారు. ఫేస్బుక్ కూడా ఇదే రీతిలో కంటెంట్ కట్టడి ప్రయత్నించనుందని ఫేస్బుక్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. చర్యలు తీసుకుంటాం: ట్విటర్ ఇక ట్విటర్లో కంటెంట్‌కు హద్దులు లేకపోవడంతో అభ్యంతర కంటెంట్ విపరీతంగా వైరల్ అవుతోంది. తుపాకుల కాల్పుల మోత దగ్గరి నుంచి విమానాశ్రయం కాల్పుల ఘటన, విమానాల్లోంచి కింద పడిన వీడియోలు, తాలిబన్ల స్వేచ్ఛా విహారం, దురాగతాలకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా ట్విటర్ ద్వారానే వ్యాప్తి చెందుతోంది. ఈ విమర్శల నేపథ్యంలో చర్యలు మొదలుపెట్టినట్లు ట్విటర్ తెలిపింది. మరోవైపు గూగుల్ అఫ్గన్ సంబంధిత కంటెంట్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఇంకా స్పష్టత ఇవ్వలేదు. హాట్ న్యూస్: తాలిబన్ ఎఫెక్ట్: ఎగుమతుల సంగతి ఏంటంటే.. వార్నింగ్ తప్పనిసరి కాబూల్ విమానాశ్రయంలో తుపాకుల మోతల నడుమ ఉరుకులు పరుగులు, రన్‌వేపై టైరుకు వేలాడిన జనం, ఆకాశం నుంచి పిట్టల్లా రాలిన జనం వీడియో.. నిన్నంతా విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే యూట్యూబ్ సహా ఫేస్బుక్, ట్విటర్ ఆఖరికి టిక్‌టాక్ లాంటి వీడియో జనరేటింగ్ యాప్‌లు కూడా వయొలెంట్ లేదా గ్రాఫిక్ కంటెంట్ వార్నింగ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని నిర్ణయించాయి. మరోవైపు యూట్యూబ్ కూడా వయసు పరిమితి (ఏజ్ రిస్రి్టక్షన్ నోట్) ద్వారా వీడియోలను ప్రదర్శించొచ్చని, కానీ, హింసాత్మకంగా ఉండే కంటెంట్‌ను మాత్రం ప్రొత్సహించబోమని స్పష్టం చేశాయి. న్యూస్ ఛానెల్స్ కూడా వార్నింగ్ నోట్ (video may be inappropriate for some users) ఇవ్వాలని, లేకుంటే వీడియోను తొలగించాల్సి వస్తుందని యూట్యూబ్ హెచ్చరించింది. తాలిబన్ల సంగతి! ప్రస్తుతం తాలిబన్లు సోషల్ మీడియాను విపరీతంగా వాడేసుకుంటున్నారు. తాలిబన్ పెద్దతలలు కూడా ట్విటర్, ఫేస్బుక్ ద్వారా అప్డేట్లు ఇస్తుండడం చూస్తున్నాం. అయితే వాళ్ల అకౌంట్లపై నిషేధం, అప్డేట్లపై లాక్ గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో అఫ్గన్ ప్రజల సోషల్ మీడియా వాడకంపై తాలిబన్ల ఆంక్షలు విపరీతమైన ప్రభావం చూపెట్టే అకాశం ఉందని అట్లాంటిక్ కౌన్సిల్ రచయిత ఎమర్సెన్ బ్రూకింగ్ అంచనా వేస్తున్నారు. -
వాట్సాప్‌లో వచ్చే ఆ కంటెంట్‌పై ఏం చేయలేం
న్యూఢిల్లీ : ఆన్లైన్ మెసేజింగ్ సైట్ వాట్సాప్‌లో వచ్చే అభ్యంతరకర కంటెంట్‌పై కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. వాట్సాప్‌లో అప్లోడ్ చేసే ఈ కంటెంట్‌ను చెక్ చేయడానికి ఎలాంటి రోడ్‌మ్యాప్ లేదని ప్రభుత్వం తెలిపింది. ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ కావడం వల్ల, మూడో పార్టీ వాటిని యాక్సస్ చేయలేరని పేర్కొంది. చట్టం కిందకు వస్తే, ఆ కంటెంట్‌పై చర్యలు తీసుకోవచ్చని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. రాజ్యసభలో ఓ కాంగ్రెస్ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ మేరకు స్పందించారు. వాట్సాప్, మొబైల్ ఫోన్ల ద్వారా వచ్చే అభ్యంతరకర వీడియోలను నిరోధించడానికి ప్రణాళికలేమైనా ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని కాంగ్రెస్ సభ్యుడు ప్రశ్నించారు. అభ్యంతరకర కంటెంట్లను పంపించిన లేదా ప్రచురించిన అలాంటి నేరాలను చట్టాలు డీల్ చేస్తాయని చెప్పారు. వాట్సాప్‌ల ద్వారా, మొబైళ్ల ద్వారా అభ్యంతరకర వీడియోలు అప్లోడ్ అవుతున్నట్టు కూడా గుర్తించినట్టు తెలిపారు. కానీ వాట్సాప్ మెసేజ్‌లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటం, మూడో పార్టీ వాటిని యాక్సస్ చేయలేమని స్పష్టంచేశారు. యూజరు ఆ కంటెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి, సంబంధిత లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలకు షేర్ చేయవచ్చని చెప్పారు. వీటితో చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, దాని సవరణ చట్టం 2008లో అభ్యంతరకర కంటెంట్‌ను పంపించిన లేదా ప్రచురించిన వారిని శిక్షించవచ్చని క్లారిటీ ఇచ్చారు. -
వాట్సాప్ అడ్మిన్ అరెస్టు!
స్మార్ట్ఫోన్లను వాడేవాళ్ల వద్ద ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పదం.. వాట్సాప్. అందులోనూ కొత్తకొత్తగా గ్రూపులు క్రియేట్ చేయడం, దానికి అడ్మిన్‌గా ఉండటం సరదా అయిపోయింది. కొత్తగా చేరేవాళ్లు తమను కూడా అడ్మిన్లుగా చేయమని అడుగుతుంటారు. అయితే ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు.. గ్రూప్ అడ్మిన్ అయిపోయామని సంబరపడక్కర్లేదు. గ్రూపులో షేర్ అయ్యే కంటెంట్ అంతటికీ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. ఇలా తెలియక ఓ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో వాట్సాప్‌లోని ఓ గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్రూపులో అభ్యంతరకరమైన కంటెంట్ ఉన్నందుకు గాను అతడు అరెస్టయ్యాడు. అతగాడితో పాటు మరో ముగ్గురు గ్రూపు సభ్యులనూ పోలీసులు లోపలేశారు. శివాజీ బర్చే, రాజ్‌కుమార్ తెలంగే, అమోల్ సోమవంశీ, మనోజ్ లవ్రాలే అనే నలుగురు అరెస్టయ్యారు.