వాట్సాప్‌లో వచ్చే ఆ కంటెంట్‌పై ఏం చేయలేం
వాట్సాప్‌లో వచ్చే ఆ కంటెంట్‌పై ఏం చేయలేం
Published Fri, Jul 28 2017 7:11 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM
న్యూఢిల్లీ : ఆన్‌లైన్ మెసేజింగ్ సైట్ వాట్సాప్‌లో వచ్చే అభ్యంతరకర కంటెంట్‌పై కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. వాట్సాప్‌లో అప్‌లోడ్ చేసే ఈ కంటెంట్‌ను చెక్ చేయడానికి ఎలాంటి రోడ్‌మ్యాప్ లేదని ప్రభుత్వం తెలిపింది. ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కావడం వల్ల, మూడో పార్టీ వాటిని యాక్సస్ చేయలేరని పేర్కొంది. చట్టం కిందకు వస్తే, ఆ కంటెంట్‌పై చర్యలు తీసుకోవచ్చని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. రాజ్యసభలో ఓ కాంగ్రెస్ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ మేరకు స్పందించారు. వాట్సాప్, మొబైల్ ఫోన్ల ద్వారా వచ్చే అభ్యంతరకర వీడియోలను నిరోధించడానికి ప్రణాళికలేమైనా ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని కాంగ్రెస్ సభ్యుడు ప్రశ్నించారు.
అభ్యంతరకర కంటెంట్లను పంపించిన లేదా ప్రచురించిన అలాంటి నేరాలను చట్టాలు డీల్ చేస్తాయని చెప్పారు. వాట్సాప్‌ల ద్వారా, మొబైళ్ల ద్వారా అభ్యంతరకర వీడియోలు అప్‌లోడ్ అవుతున్నట్టు కూడా గుర్తించినట్టు తెలిపారు. కానీ వాట్సాప్ మెసేజ్‌లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటం, మూడో పార్టీ వాటిని యాక్సస్ చేయలేమని స్పష్టంచేశారు. యూజరు ఆ కంటెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి, సంబంధిత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీలకు షేర్ చేయవచ్చని చెప్పారు. వీటితో చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, దాని సవరణ చట్టం 2008లో అభ్యంతరకర కంటెంట్‌ను పంపించిన లేదా ప్రచురించిన వారిని శిక్షించవచ్చని క్లారిటీ ఇచ్చారు.
Advertisement
Advertisement