వాట్సాప్ అడ్మిన్ అరెస్టు!
స్మార్ట్ఫోన్లను వాడేవాళ్ల వద్ద ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పదం.. వాట్సాప్. అందులోనూ కొత్తకొత్తగా గ్రూపులు క్రియేట్ చేయడం, దానికి అడ్మిన్గా ఉండటం సరదా అయిపోయింది. కొత్తగా చేరేవాళ్లు తమను కూడా అడ్మిన్లుగా చేయమని అడుగుతుంటారు. అయితే ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు.. గ్రూప్ అడ్మిన్ అయిపోయామని సంబరపడక్కర్లేదు. గ్రూపులో షేర్ అయ్యే కంటెంట్ అంతటికీ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుసుకోవాలి.
ఇలా తెలియక ఓ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో వాట్సాప్లోని ఓ గ్రూప్ అడ్మిన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్రూపులో అభ్యంతరకరమైన కంటెంట్ ఉన్నందుకు గాను అతడు అరెస్టయ్యాడు. అతగాడితో పాటు మరో ముగ్గురు గ్రూపు సభ్యులనూ పోలీసులు లోపలేశారు. శివాజీ బర్చే, రాజ్కుమార్ తెలంగే, అమోల్ సోమవంశీ, మనోజ్ లవ్రాలే అనే నలుగురు అరెస్టయ్యారు.