న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఉదంతంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా నిరసనగా ఖేల్ రత్న, అర్జున అవార్డులను రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఢిల్లీలో రోడ్డుపై వదిలేయడం తెలిసిందే. ఆ వీడియోను రాహుల్ ఆదివాంర ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ప్రధానిని వైఖరిని ఎండగట్టారు. ‘‘భారతదేశంలోని ప్రతి అమ్మాయి ఆత్మాభిమానానికి అత్యంత విలువ ఇస్తుంది. అవార్డులు, పురస్కారాలన్నీ ఆ తర్వాతే. ఇలాంటి ధైర్యశాలుల కంటే ‘బాహుబలి’ వంటి పరపతి గల వ్యక్తుల నుంచి పొందే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయా?’’ అని మోదీని ప్రశ్నించారు. ‘‘ప్రధాని అంటే దేశ రక్షకుడు. ఇంతటి తీవ్రమైన అంశంలో ఇంత నిర్దయగా వ్యవహరించడం చాలా బాధేస్తోంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment