సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో అమలుచేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించి, మిగతా రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచిస్తుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం విమర్శిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సచి వాలయంలో గురువారం ఆయన విలేక రులతో మాట్లాడారు. తెలంగాణలో స్కూళ్లను మూసివేయడంగానీ, విలీనం చేయడంగానీ లేదన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తాము చేపట్టిన చర్యల వల్ల డ్రాపవుట్స్‌లో జాతీయ సగటుకంటే తెలంగాణ సగటు తక్కువ ఉందని చెప్పారు. 40 వేల ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కడ ఉన్నాయో విమర్శిస్తున్నవాళ్లే చూపాలన్నారు. టీడీపీని, టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానన్నారు.
విద్యాశాఖపై జవదేకర్ ప్రశంసలు
ఇటీవల ఢిల్లీలో జరిగిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ (కేబ్) సమావేశంలో రాష్ట్ర విద్యా కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చానని కడియం తెలిపారు. వాటిని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసించడమే కాకుండా, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని విద్యాశాఖ మంత్రుల సమావేశంలో సూచించారన్నారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ బాలి కలకు డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ లు, బాలికలకు ప్రత్యేకంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్, గురుకులాల్లో అమలు చేస్తున్న మెనూ, ఉన్నత విద్యలో బోగస్ అడ్మిషన్లు అరికట్టేందుకు తెచ్చిన దోస్త్, బయో మెట్రిక్ మిషన్ల ద్వారా అటెండెన్స్ తీసుకోవడం, విద్యార్థుల అడ్మిషన్లను ఆధార్‌కార్డుతో అను సంధానించడం వంటివి అందులో ఉన్నా యని పేర్కొన్నారు.
కొత్త జిల్లా కేంద్రాల్లో కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవో దయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరా మన్నారు. ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ, రీజినల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కూడా తెలంగాణకు ఇవ్వాలని కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాసినా స్పందన లేదని, కేంద్రం తెలంగాణపట్ల చిన్న చూపు చూస్తోందని కేబ్ సమావేశంలోనే చెప్పాన న్నారు. తెలంగాణ వచ్చాక వచ్చిన కొత్త సం స్థలేమిటో బీజేపీ నేతలే చెప్పాలని ప్రశ్నిం చారు. కేంద్రానికి తామిచ్చిన వినతి పత్రాల ప్రతులను లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, దత్తా త్రేయకు పంపుతున్నామని, వారి పలుకుబడి ఉపయో గించి ఆ సంస్థలు తెలంగాణకు తీసుకొస్తే మంచిదన్నారు. విద్యాశాఖలో కేవలం 13 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, చెప్పారు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణపై ప్రభుత్వం వివక్ష చూపుతోందా? అని విలేకరులు ప్రశ్నించగా, ప్రభుత్వానికి ఎవరి పైనా కక్షలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment