శివసాగర్/జోర్హాట్(అస్సాం): భారత్ జోడో న్యాయ్ యాత్రను అస్సాంలో మొదలుపెడుతూనే ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. నాగాలాండ్ బుధవారం ముగిసిన యాత్ర అస్సాంలో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శివసాగర్ జిల్లాలోని హాలోటింగ్ పట్టణంలో వందలాది మంది పార్టీ కార్యకర్తల సమక్షంలో రాహుల్ మాట్లాడారు.
‘‘ దేశంలో అత్యంత అవినీతిమయ ప్రభుత్వం ఉందంటే అది ఈ రాష్ట్ర సర్కారే. అతిపెద్ద అవినీతి సీఎం కూడా ఇక్కడే ఉన్నారు’’ అని ఆరోపించారు.
జొర్హాట్ జిల్లాలోని దేబెరాపూర్‌లోని వీధి సమావేశంలోనూ రాహుల్ పాల్గొని ప్రసంగించారు.
‘‘ అస్సాంలోని బీజేపీ రాష్ట్ర సర్కార్ ఇక్కడి గిరిజనులు, తేయాకు కారి్మకులు, స్థానిక తెగలకు అన్యాయం చేస్తోంది. సంపదను కొల్లగొడుతూ విద్వేషాన్ని చిమ్ముతోంది.
యాత్ర మొదలైన మణిపూర్‌లో జాతుల మధ్య వైరం కార్చిచ్చులా విస్తరించి నివురుగప్పిన నిప్పులా ఉంది. దానిని చల్లార్చేందుకు కనీసం ఒక్కసారైనా మోదీ మణిపూర్‌కు రాలేదు. ఇక నాగాలాండ్‌లో నాగాల సమస్యను పరిష్కరిస్తామని మోదీ సర్కార్ తొమ్మిదేళ్ల క్రితం ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ అది ఎంత వరకు సఫలమైందనేది మోదీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’’ అని రాహుల్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment