భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో రాహుల్‌పై నమోదైన క్రిమినల్ కేసును పోలీసులు సీఐడీకి బదిలీ చేశారు. జనవరి 23న గువాహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు కోసం సీఐడీకి బదిలీ చేసినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ ట్విటర్ ద్వారా తెలిపారు. సమగ్రమైన, లోతైన విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
కాగా మంగళవారం మేఘాలయా నుంచి అస్సాం గువాహటిలోకి రాహుల్ ప్రవేశించగా.. సిటీలోకి ఆయన యాత్రకు అనుమతి లేదని అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లను దాటి దూసుకురావడంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో అస్సాంలో ఘర్షణలు సృష్టించినందుకు.. హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు వంటి ఆరోపణలతో రాహుల్, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై 9 కేసు నమోదు చేశారు.
దీంతో రాహుల్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గువాహటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత హెచ్చరించారు. దీనిపై రాహుల్ కౌంటర్ ఇస్తూ బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు రాహుల్ భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోనళ వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకేంద్రహోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి బదిలీ చేయడం ఆసక్తిగా మారింది.
చదవండి: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment