న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..తిరిగి వస్తూ విమానంలో కొంతైనా నల్లధనాన్ని తీసుకువచ్చారా అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానన్న మోదీ ఎన్నికల హామీపై ఆయన ట్వీటర్‌లో ఈ వ్యంగ్యాస్త్రం సంధించారు. మీరు స్విట్జర్లాండ్ నుంచి నల్లధనం తెస్తారని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఎద్దేవాచేశారు. దావోస్ వేదికపై ప్రసంగించిన మోదీ.. దేశంలోని సంపదలో 73 శాతం ఒక్క శాతం ఉన్న ధనికుల వద్దే ఎందుకు పోగుపడిందనే విషయంపైనా ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిపై రిఫరెన్స్ కోసం.. సంబంధిత ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదికను కూడా జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment